మావోయిస్టు లతో సంబంధాలు ఉన్నాయి అన్న అనుమానం తో ఉస్మానియా యూనివర్సటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కాశిం ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.మావోలతో కాశీమ్ కు సంబంధాలు ఉన్నాయి అని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలో యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణలోని క్వార్టర్స్‌లో కాశీం నివాసం ఉంటుండగా గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో సోదాలు కొనసాగిస్తున్నారు అధికారులు.మావోయిస్టులతో కాశీంకు సంబంధాలు ఉన్నాయి అంటూ 2016లోనే కేసు నమోదు అయ్యింది.
ఈ నేపథ్యంలో ఆ కేసులో భాగంగానే ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో ఏ-2 గా ఉన్నారు కాశీం.
ఇదే కేసులో గతంలో మావోయిస్టు పుస్తకాలు, సాహిత్యాలు, స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.ఇదే కేసులో మరోసారి సెర్చ్ వారెంట్‌తో కాశీం ఇంట్లో సోదాలు నిర్వహిస్తోన్నట్టు చెబుతున్నారు.
కాగా, ఈ మధ్యే విరసం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు డాక్టర్ కాశీం.ఓయూలో ఆయన నివాసం ఉంటున్న ఇంటి తలుపులు పగలగొట్టి పోలీసులు లోపలికి వెళ్లినట్టు ఆరోపిస్తున్నారు.
దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.