సినీ ప్రపంచంలో అత్యున్నత పురష్కారాలు అయిన ఆస్కార్ పండగ మొదలైంది.సిని ప్రపంచంలో ఇండియాలో అయితే జాతీయ అవార్డు ఎలా రావాలని అనుకుంటారో అలాగే హాలీవుడ్ లో ఒక్కసారైనా ఆస్కార్ రావాలని కోరుకుంటారు.
ఇప్పుడు మరోసారి ఈ అవార్డు వేడుకకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.ఇక ఈ అవార్డు వేడుకలలో నామినేట్ అయిన సినిమాల వివరాలని తాజాగా ప్రకటించారు.
ఇక ఈ సంబరాలు ఫిబ్రవరి 9న జరగనున్నాయి.దీని కోసం హాలీవుడ్ అతిరధ మహారధులు అందరూ సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సారి ఉత్తమ చిత్రాల కేటగిరీలో అందరూ ఊహించినట్లుగానే జోకర్ చేరింది.హాలీవుడ్ లో గత ఏడాది రిలీజ్ అయిన వాటిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది.
ఈ నేపధ్యంలో ఈ సినిమా ఆస్కార్ కి వెళ్ళడం పక్కా అని అందరూ భావించారు.అనుకున్నట్లుగానే ఉత్తమ చిత్రాల కేటగిరిలో ఈ సినిమా పోటీ పడుతుంది.అలాగే టైటానిక్ హీరోగా ఇండియాలో అందరికి పరిచయం ఉన్న లియోనార్డో డికాప్రియో ఈ సారి ఉత్తర నటుడు కేటగిరిలో పతుడు పడుతున్నాడు.అతనితో పాటు మరో నలుగురు ఈ కేటగిరిలో పోటీలో ఉన్నారు.