ఆస్కార్‌కు నామినేట్‌ అయిన 'జల్లికట్టు' తెలుగులో వచ్చింది మీకు తెలుసా?  

oscar nominated jallikattu movie in aha ott with same title ,oscar nominated jallikattu,aha movie ,jallikattu oscar, telugu film news, oscar movie - Telugu Aha Jallikattu, Aha Movie, Jallikattu, Jallikattu Oscar, Oscar Movie, Telugu Film News

మలయాళ మూవీ జల్లికట్టు ఆస్కార్‌ నామినేషన్‌ లో చోటు దక్కించుకుంది.ఇండియన్‌ సినిమాలు దాదాపు 30 వరకు పోటీ పడగా అందులో ఈ సినిమా చోటు దక్కించుకోవడం జరిగింది.

TeluguStop.com - Oscar Nominated Jallikattu Movie In Aha Ott With Same Title

మలయాళ సినిమాలు కంటెంట్‌ తో ఉంటాయి అనడంలో సందేహం లేదు.కమర్షియల్‌ సినిమాలకు చాలా దూరంగా ఉండే మలయాళీలు ఈ సినిమాను తమదైన శైలిలో రూపొందించారు.

ఒక దున్నపోతును అదుపులోకి తీసుకునేందుకు చేసే ప్రయత్నాలతో ఈ సినిమా సాగుతోంది.మటన్‌ కోసం కొయాలనుకున్న దున్నపోతు తప్పించుకుంటుంది.

TeluguStop.com - ఆస్కార్‌కు నామినేట్‌ అయిన జల్లికట్టు’ తెలుగులో వచ్చింది మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ దున్నపోతు ఊరంతా కూడా వీరంగం వేస్తుంది.ఎంతో మందిని తొక్కి చంపేస్తుంది.

చాలా సహజంగా ఉన్న కథతో పాటు అన్ని భావోద్వేగాలను పలికించిన సినిమా అనడంలో సందేహం లేదు.ఈ సినిమా తెలుగులో వచ్చింది.

తెలుగులో డబ్ అయిన విషయం చాలా మందికి తెలియనే తెలియదు.

ఆహాలో వరుసగా మలయాళ సినిమాలు డబ్‌ అయ్యాయి.

అందులో ఒకటి ఈ జల్లికట్టు.అదే టైటిల్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మలయాళి సినిమా తెలుగులో పెద్దగా జనాల దృష్టిని ఆకర్షించలేక పోయింది.

ఇలాంటి సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టరు.కనీసం సినిమాను చూసేందుకు కూడా ఆసక్తి చూపించరు.

జల్లికట్టును కూడా ఆహాలో జనాలు పెద్దగా చూసింది లేదు.సినిమాను చూడటం మొదలు పెడితే చివరి వరకు చూడాలనే ఆసక్తి మాత్రం ఉంటుంది.

సినిమా ఆహాలో ఎంత మంది చూసి ఉంటారో కాని ఇప్పుడు ఆస్కార్‌ కు నామినేట్‌ అయ్యింది అనగానే చాలా మంది చాలా రకాలుగా చర్చించుకుంటున్నారు.దాంతో సోషల్‌ మీడియాలో ఈ సినిమా తెలుగు వర్షన్‌ గురించి కూడా చర్చ జరుగుతోంది.

మీకు కూడా ఈ సినిమాపై ఆసక్తి ఉంటే తప్పకుండా ఆహాకు వెళ్లి ఈ సినిమాను చూడండి.ఒక మంచి సినిమా అనడంలో సందేహం లేదు అని మీరే అంటారు.

#Jallikattu #Aha Jallikattu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు