కరోనా ఎఫెక్ట్: ఆస్కార్ 2021 పండుగ వాయిదా పడనుందా ...?

సినిమా ప్రపంచంలో అత్యున్నత పురస్కారం ఏదంటే టక్కున సమాధానం ఆస్కార్ అవార్డ్.ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన సినిమాలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి కళాకారులను అవార్డులతో సత్కరించుకునే పండుగలాంటి వాతావరణం అది.నిజానికి ఆ అవార్డులతో నామినేట్ అవ్వడమే చాలా కష్టం.అలాంటి అవార్డు గెలిస్తే ఇంకా ఏమైనా ఉందా… ?

 Corona Effect: Whether The Oscar 2021 Festival Is Postponed, Oscar Awards, Lock-TeluguStop.com

ఈ అవార్డు వచ్చిన వారు ఎవరెస్టు శిఖరం ఎక్కినట్లుగా భావిస్తుంటారు.యావత్ ప్రపంచం ఎప్పుడు ఎప్పుడు అని చూసే ఆస్కార్ పండుగ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.మామూలుగా ఆస్కార్ అంటే హాలీవుడ్, హాలీవుడ్ అంటే ఆస్కార్ అన్నట్లుగా కొనసాగుతోంది ఈ మధ్యకాలంలో.

ఏ నటీనటులు అయినా సరే ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడవడం ఒక గొప్ప వరంగా భావిస్తారు.ఇక పోతే ఈ సారి అవకాశం ఎవరికీ దొరికేలా లేదు.

దీనికి కారణం ఈ అవార్డులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుగుతుంది.కాకపోతే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉండడంతో వేడుకలను రెండు నెలల పాటు వాయిదా వేశారు ఆస్కార్ కార్యవర్గం.

మొదటగా ఏప్రిల్ 25వ తేదీన ఈ కార్యక్రమం ఉంటుందని అకాడమీ ఓ ప్రకటనలో తెలియజేసింది.చరిత్రలో మొట్టమొదటి సారిగా ఈ కార్యక్రమాన్ని ఎనిమిది వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు కూడా తెలియజేసింది.

అలాగే ఈ ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడే చిత్రాల అర్హత తేదీని కూడా పొడిగిస్తున్నట్లు తెలియజేశారు.ఇకపోతే ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో సినీ నిర్మాతలు సినిమాలను రిలీజ్ చేయడం లేదు.

దీంతో అవార్డుల కార్యక్రమానికి కూడా వాయిదా వేస్తున్నట్లు అకాడమీ ప్రెసిడెంట్ తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube