ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాటకే ఆస్కార్ పక్కా.. ఇదే సాక్ష్యం అని చెబుతూ?

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వస్తుందా? లేదా? అనే టెన్షన్ ప్రస్తుతం సినీ ప్రేక్షకుల మదిలో ఉంది.ఈ సాంగ్ కు ఆస్కార్ వస్తే తారక్, చరణ్ పేర్లు మరోమారు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగడంతో పాటు రాజమౌళి ప్రతిభ గురించి దేశవ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతుంది.

 Oscar Award To Rrr Naatu Naatu Song Details Here Goes Viral In Social Media ,ta-TeluguStop.com

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి సైతం ఈ సినిమా తర్వాత సినిమా ఆఫర్లు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

ఈ పాటకే ఆస్కార్ వస్తుందని అందుకు సాక్ష్యం ఇదేనని కొంతమంది ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

మార్చి నెల 12వ తేదీన ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుండగా ఆస్కార్ అవార్డుల వేడుకలో నాటు నాటు సాంగ్ ను టెలీకాస్ట్ చేయాలని కీరవాణికి ఫోన్ వచ్చిందని తెలుస్తోంది.సాధారణంగా అవార్డు వచ్చిన పాటలను మాత్రమే ఈ విధంగా ప్రదర్శించడం జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Telugu Charan, Music Keeravani, Naatu Naatu, Oscar Award, Oscaraward, Rajamouli,

ఆర్ఆర్ఆర్ మూవీకి అవార్డ్ రావడం లాంఛనమే అని మరో 35 రోజులు ఫ్యాన్స్ ఎదురు చూస్తే శుభవార్త వినడం ఖాయమని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ఎన్టీఆర్, చరణ్ ఈ ఈవెంట్ కు హాజరు కావడం కోసం తమ షెడ్యూల్ ను ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారని సమాచారం అందుతోంది. ఆర్ఆర్ఆర్ కు అవార్డ్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకునే అవకాశాలు ఉన్నాయి.

Telugu Charan, Music Keeravani, Naatu Naatu, Oscar Award, Oscaraward, Rajamouli,

నాటు నాటు సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటికే రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంది.ఆర్ఆర్ఆర్ మూవీకి ఊహించని స్థాయిలో ప్రమోషన్స్ చేసిన రాజమౌళి ఈ సినిమాకు అవార్డ్ వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆర్ఆర్ఆర్ మూవీ రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.

జక్కన్న తెలుగు సినిమాల ఖ్యాతిని మరింత పెంచుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube