ఒబామాను చంపి.. బైడెన్‌ను వదిలేయండి: మిలిటెంట్లకు బిన్‌లాడెన్ ఆదేశాలు, వెలుగులోకి 11 ఏళ్ల నాటి లేఖ

ఒసామా బిన్‌లాడెన్.ఈ పేరు వింటే ముందుగా గుర్తొచ్చేది అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ, అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చివేతలే.

 Osama Bin Laden Warned In 2010 Letter Biden Would Lead Us Into Crisis , Osama Bi-TeluguStop.com

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యం అమెరికానే వణికించిన ఈ కరడుగట్టిన ఉగ్రవాది.తన సిద్ధాంతాలతో ఉగ్రవాదాన్ని కొత్త పుంతలు తొక్కించాడు.

తాలిబన్ల అండతో పేట్రెగిపోయాడు.అయితే 9/11 దాడులతో తన చావును తనే కొని తెచ్చుకున్నాడు.

న్యూయార్క్ ట్విన్ టవర్స్ మీద జరిగిన దాడులతో అగ్రరాజ్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.ఈ దాడిలో సుమారు మూడు వేల మంది వరకు ప్రాణాలు కోల్పోగా.6వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన అమెరికా.

తీవ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్‌లో అడుగుపెట్టి భీకరదాడులు చేసింది.

ఈ దెబ్బకు అల్‌ఖైదా గ్రూపు చెల్లాచెదురైంది.

ఒసామా బిన్ లాడెన్‌ కోసం పదేళ్ల పాటు నింగి, నేలా అన్న తేడా లేకుండా వెతికిన అమెరికా .ఎట్టకేలకు 2011, మే2న పాకిస్తాన్‌లోని అబోట్టాబాద్‌లో తలదాచుకున్న బిన్‌ లాడెన్‌ను హతమార్చిన విషయం తెలిసిందే.అయితే పదేళ్ల కిందటే మట్టిలో కలిసిపోయిన బిన్ లాడెన్ పేరు.ఆఫ్ఘనిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మరోసారి వార్తల్లోకెక్కింది.ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై లాడెన్ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం.జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాలని బిన్ లాడెన్ అప్పట్లో బలంగా కోరుకున్నాడని.

కొన్ని కీలక పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

అమెరికా బలగాలు ఒసామా బిన్‌లాడెన్‌ను హతమార్చిన తర్వాత ఘటనాస్థలంలో కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి.

అందులో లాడెన్ తన సహచరుడైన అతియా అబ్ద్ అల్ రహమాన్ అనే వ్యక్తికి 2010లో రాసిన 48 పేజీల లేఖ కూడా దొరికింది.ఆ లేఖలో బిన్‌లాడెన్ బతికుండగా.

అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను హతమార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది.ఒబామాతోపాటు అప్పటి యూఎస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ డేవిడ్ పెట్రస్‌‌ను కూడా చంపాలని బిన్ లాడెన్ తన అనుచరులతో పలుమార్లు పథకం రచించాడట.

Telugu Afghanistan, Al Qaeda, America, David Petrus, Donald Trump, Joe Biden, Ob

ఒబామా, డేవిడ్ పెట్రస్‌లను హతమార్చాలనుకున్న బిన్ లాడెన్.నాటి అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న బైడెన్‌ను మాత్రం వదిలిపెట్టాడు.అంతేకాకుండా బైడెన్‌ను టార్గెట్ చేయొద్దని బిన్‌ లాడెన్ తన అనుచరులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు.ఒబామా చనిపోతే అమెరికా చట్టాల ప్రకారం.జో బైడెన్ దేశాధ్యక్ష పదవిని చేపడతాడని బిన్ లాడెన్ తన అనుచరులకు తెలిపాడు.అదే జరిగితే బైడెన్ తన అసమర్థ పాలనతో అమెరికాను సంక్షోభంలోకి తీసుకెళ్తాడని.

దాంతో అగ్రరాజ్యం పతనం దిశగా వెళుతుందని బిన్ లాడెన్ ఆ లేఖలో పేర్కొన్నాడట.

కాగా, ఆఫ్గనిస్థాన్‌లో మళ్లీ తాలిబన్ల రాజ్యం ఏర్పడటానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

అమెరికా-నాటో దళాల ఉపసంహరణ ద్వారా తాలిబన్ల చేతికి దేశాన్ని అప్పజెప్పాడంటూ ఆఫ్గన్‌ ప్రభుత్వం-ప్రజలు సైతం బైడెన్‌పై దుమ్మెత్తి పోశారు.మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం బైడెన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

పలువురు ప్రముఖులు, విశ్లేషకులు సైతం తాలిబన్ల విజయాన్ని అమెరికా ఓటమిగా అభివర్ణించారు.ట్రంప్ కూడా దీన్ని అమెరికా చరిత్రలో అతిగొప్ప ఓటముల్లో ఒకటిగా పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో జో బైడెన్‌ను అసమర్థుడిగా అభివర్ణిస్తూ ఒసామా బిన్‌లాడెన్ 11 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube