పేరొచ్చిందని తల పొగరు చూపించింది... నాకు కనీస గౌరవం ఇవ్వలేదు  

Oru Adaar Love Director Omar Lulu Slams Priya Prakash Varrier-omar Lulu,oru Adaar Love Director,priya Prakash Varrier

త ఏడాది సోషల్‌ మీడియా సంచలనంగా నిలిచింది ప్రియావారియర్‌. మలయాళంలో ఆమె నటించిన ‘ఒరు ఆదార్‌ లవ్‌’ చిత్రంలోని ఒక పాటలో కన్ను గీటి, ముద్దుగన్ను పేల్చి ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది. జాతీయ స్థాయిలో ఈమెకు గుర్తింపు దక్కింది. ప్రియా వారియర్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో పెరిగిందంటే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ అంబాసిడర్‌గా వ్యవహరించే కంపెనీలు కూడా ఈమెను బుక్‌ చేసుకున్నాయి...

పేరొచ్చిందని తల పొగరు చూపించింది... నాకు కనీస గౌరవం ఇవ్వలేదు-Oru Adaar Love Director Omar Lulu Slams Priya Prakash Varrier

అంతటి క్రేజ్‌ ఒక్కసారిగా వస్తే ఎవరికైనా కాస్త పొగరు అనేది వస్తుంది.

అందరికి కాస్త వస్తే ప్రియా వారియర్‌కు మాత్రం ఎక్కువ పొగరు వచ్చిందని ఒరు ఆదార్‌ లవ్‌ దర్శకుడు ఒమర్‌ లులు అంటున్నాడు. సినిమాలో ప్రధాన హీరోయిన్‌గా తాము మొదటి నుండి నూరిన్‌ను అనుకున్నాం.

కాని ప్రియావారియర్‌కు వచ్చిన గుర్తింపు వల్ల ఆమె పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత కల్పించాలని డిమాండ్‌ పెరిగింది. తప్పనిసరి పరిస్థితులో అలా చేయడం జరిగింది. అలా చేయడం వల్ల సినిమా ఫలితం తారు మారు అయ్యింది.

ఆమె పాత్ర విషయంలో ఆమె చాలా పట్టుబట్టింది. ఎక్కువగా తానే కనిపించాలని చెప్పేది.

సినిమా ప్రారంభం అయిన సమయంలో ప్రియా నాపై చూపించిన గౌరవం, చివరికి వచ్చేప్పటికి పూర్తిగా మారిపోయింది. నన్ను కనీసం గౌరవించేది కాదు.

షూటింగ్స్‌కు సరిగా వచ్చేది కాదు అంటూ దర్శకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికే నూరిన్‌ కూడా ప్రియా వారియర్‌పై ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఒక్కసినిమాతోనే మంచి క్రేజ్‌ తెచ్చుకున్న ప్రియా వారియర్‌ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగడం కష్టమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు...