ఓర్మాక్స్‌ లో మళ్లీ టాప్‌ లో నిలిచిన శ్రీసత్య... సోషల్‌ మీడియాలో తగ్గడం లేదుగా

సోషల్ మీడియాలో వారం వారం ఈ సెలబ్రిటీలు టాప్ లో ఉన్నారు.ఏ సినిమాలు టాప్ లో ఉన్నాయి… ఈ సంఘటనలు టాప్ లో ఉన్నాయి అనే విషయాలని ఓర్మాక్స్‌ మీడియా వారు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు అందజేయడం జరుగుతుంది.

 Ormax  Top 5 Most Popular Biggboss Telugu 6 Contestants,ormax,sri Satya,revanth,-TeluguStop.com

ఈ విషయమై ప్రతి వారం కూడా వారు జాబితాను విడుదల చేయడం మనం చూస్తూనే ఉన్నాం.సౌత్ ఇండియన్ స్టార్స్, బాలీవుడ్ స్టార్స్, హీరోలు, హీరోయిన్స్ ఇలా అనేక జాబితాలను సదరు మీడియా సంస్థ విడుదల చేస్తుంది.

అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్స్ విషయంలో కూడా సోషల్ మీడియాలో సర్వే నిర్వహించి టాప్ 5 ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది.తాజాగా ఈ సంస్థ సెప్టెంబర్ 24 నుండి సెప్టెంబర్ 30 వ తారీకు మధ్య సోషల్ మీడియాలో టాప్ లో ఉన్న బిగ్ బాస్‌ సెలెబ్రిటీల జాబితాలను విడుదల చేసింది.

ఆ సందర్భంగానే బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్ జాబితాని కూడా విడుదల చేయడం జరిగింది.టాప్ 5 లో నెంబర్ 1 గా రేవంత్ నిలిచాడు.

రెండో స్థానంలో శ్రీహన్‌ నిలిచాడు.మూడో స్థానంలో శ్రీ సత్య, నాలుగో స్థానంలో చలాకి చంటి, ఐదవ స్థానంలో ఫైమా దక్కించుకున్నారు.

Telugu Bigg Boss, Nagarjuna, Ormax, Revanth, Sri Satya, Srihan-Movie

గతవారం శ్రీ సత్య కి నెంబర్ 1 స్థానం దక్కగా ఈసారి మూడవ ప్లేసులో నిలిచింది.ఆమె టాప్ పై లో ఉండడం చాలా గొప్ప విషయం అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అదే సమయంలో పెద్దగా ఆట ఆడని చలాకి చంటి కూడా ఈ జాబితాలో ఉండడం విడ్డూరంగా ఉంది అనిపిస్తుంది అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఈ ఐదుగురు స్థానాలు కాస్త అటు ఇటు మారుతున్నాయి తప్పితే రెగ్యులర్ గా వీళ్ళే సోషల్ మీడియాలో తెగ సందడి చేసే సెలబ్రిటీలు అన్నట్లుగా ఓర్మాక్స్‌ మీడియా వారు చెప్పగానే చెప్తున్నారు.

ఈ ఐదుగురిలో విజేత ఎవరైనా ఉంటారా లేదంటే వారాలు గడుస్తున్నా కొద్ది ప్రేక్షకుల అభిప్రాయం మారుతుందా అనేది చూడాలి.ప్రస్తుతానికైతే నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న రేవంత్ ని ఎక్కువ శాతం విజేత అంటూ జనాలు నమ్ముతున్నారు.

బిగ్ బాస్ రివ్యూవర్స్ కూడా రేవంత్ నెంబర్ 1 విజేతగా అయ్యే లక్షణాలు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube