టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి టాప్ హీరో ఇతనే.. ఓరమ్యాక్స్ సర్వేలో సత్తా చాటిన హీరో ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood Industry )లో నంబర్ వన్ హీరో ఎవరనే చర్చ జరగడం కొత్త కాదు.ఈ ప్రశ్నకు సరైన సమాధానం కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.

 Ormax Most Populr Male Stars List Details Here Goes Viral In Social Media , Pr-TeluguStop.com

తమ ఫేవరెట్ హీరోనే నంబర్ వన్ అని చెబుతూ పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కూడా జరిగాయి.అయితే ఓరమ్యాక్స్ సర్వే ప్రతి నెలా సర్వే చేసి నంబర్ వన్ హీరోల వివరాలను తెలియజేయడంతో పాటు ఇతర హీరోల స్థానాల గురించి కూడా వెల్లడిస్తోంది.

ఈ సర్వేలో టాలీవుడ్ నుంచి టాప్ హీరోగా ప్రభాస్ ( Prabhas )నిలిచారు.సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుసగా క్రేజీ ఆఫర్లతో సత్తా చాటుతున్న ప్రభాస్ ఈ జాబితాలో టాప్ లో నిలవడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.ఆల్ ఇండియా మేల్ పాపులర్ స్టార్స్ జాబితాను ఓరమ్యాక్స్ రిలీజ్ చేయగా ఈ జాబితాలో టాప్3 స్థానంలో ప్రభాస్ నిలవగా టాప్7 స్థానంలో తారక్, టాప్8 స్థానంలో అల్లు అర్జున్( Allu Arjun ), టాప్10 స్థానంలో మహేష్ బాబు( Mahesh Babu ) నిలిచారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ నలుగురు హీరోలకు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కడం గమనార్హం.మహేష్ ఖాతాలో పాన్ ఇండియా హిట్ లేకపోయినా ఈ జాబితాలో చోటు దక్కింది.ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వస్తున్నాయి.

అదే సమయంలో దసరా సందర్భంగా గుంటూరు కారం సినిమా ( Guntur Kaaram movie )నుంచి ఒక అప్ డేట్ ఇస్తామని ప్రకటన వెలువడింది.ఓరమ్యాక్స్ మీడియా సర్వేల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సర్వేను ఎలా నిర్వహిస్తారో క్లారిటీ లేదని ఆ విషయాలను వెల్లడిస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.ఈ సర్వే కోసం ఎంతమంది ఓట్లను పరిగణనలోకి తీసుకున్నారో తెలియాల్సి ఉంది.

Ormax Most Popular Tollywood Heroes

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube