ఆ సర్వేలో ఫస్ట్ ప్లేస్ లో వంటలక్క.. డాక్టర్ బాబు స్థానం ఎంతంటే?

సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లకు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొంతమంది సీరియల్ హీరోయిన్లకు కూడా అదేస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.బుల్లితెర ప్రేక్షకులు విపరీతంగా అభిమానించే నటీమణులలో ప్రేమీ విశ్వనాథ్ కూడా ఒకరు.

 Ormax Media Survey On Telugu Serial Actors Goes Viral , Goes Viral, Ormax Media,-TeluguStop.com

ప్రేమీ విశ్వనాథ్ నటిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఇతర సీరియళ్లకు గట్టి పోటీని ఇవ్వడంతో పాటు ఊహించని స్థాయిలో రేటింగ్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

అర్మాక్స్ మీడియా సర్వేలో తెలుగులో మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్లలో వంటలక్క తొలి స్థానంలో నిలిచింది.

సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉండటంతో ప్రేమీ విశ్వనాథ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది.ఈ సీరియల్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న డాక్టర్ బాబు రెండో స్థానంలో ఉన్నారు.

మూడో స్థానంలో జానకి కలగనలేదు సీరియల్ లోని జానకి పాత్ర, నాలుగో స్థానంలో త్రినయని సీరియల్ లోని నయని పాత్రలు నిలిచాయి.

ఐదో స్థానంలో జానకి కలగనలేదు సీరియల్ లోని రామా పాత్ర, ఆరో స్థానంలో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లోని తులసి పాత్ర, ఏడో స్థానంలో ప్రేమ ఎంత మధురం సీరియల్ లోని ఆర్య పాత్ర, ఎనిమిదో స్థానంలో గుప్పెడంత మనసు సీరియల్ లోని రిషి పాత్ర, తొమ్మిదో స్థానంలో గుప్పెడంత మనసు సీరియల్ లోని వసుధార పాత్ర, పదో స్థానంలో కళ్యాణ వైభోగం సీరియల్ లోని మంగ పాత్ర నిలిచాయి.

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే సీరియల్ లోని నటీనటులే ఈ జాబితాలో ఎక్కువగా ఉండటం గమనార్హం.ఈ జాబితాలో వంటలక్క తొలి స్థానంలో నిలవడంతో ఆమె అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు .వయస్సు పెరుగుతున్నా వంటలక్కకు ప్రేక్షకుల్లో క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం.వంటలక్క మరిన్ని సీరియల్స్ లో నటించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Ormax Media Survey On Telugu Serial Actors Goes Viral , Goes Viral, Ormax Media, Premi Viswanath, Telugu Serial Actors - Telugu Ormax, Premi Viswanath, Teluguserial

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube