బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా.. పాట పాడిన గాయని ఎవరో తెలుసా?

తెలుగు నేతల మీద జానపదాలు ఎప్పటి నుంచో వినపడుతున్నా.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వాటి ప్రభావం మరింత పెరిగింది.

 Original Singer Of Bullet Bandi Song Mohana Bhogaraju, Bullet Bandi Singer, Moha-TeluguStop.com

ప్రజలు మాట్లాడుకునే పదాలను అందంగా మార్చి రాగయుక్తంగా పాడిన ఎన్నో పాటలు జనాల్లో దూసుకెళ్తున్నాయి.కొన్ని పాటలు అద్భుతంగా ఉన్నా.

ఒక్కోసారి ఆ పాటలకు అంతగా గుర్తింపు రాదు.ఒక్కో టైంలో ఆ పాటలు పటాసుల్లా పేలుతాయి.

ఎవరి నోట విన్నా అవే పాటలు వినిపిస్తాయి.తాజాగా తెలుగు రాష్ట్రాలను ఊపుతున్న పాట బుల్లెట్లు బండెక్కి వచ్చేత్తా పా.

తాజాగా ఓ పెళ్లి బరాత్ లో పెళ్లి కూతురు ఈ పాటకు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ అవుతోంది.ఇంతకీ ఈ పాట పాడిందెవరు? రాసింది ఎవరు? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఈ పాటను లక్ష్మణ్ రచించాడు.ఎస్ కే జాజి మ్యూజిక్ అందించాడు.ప్రముఖ గాయని మోహన భోగరాజు ఈ పాట పాడింది.ఆగస్టు ఏప్రిల్‌ 7న యూట్యూబ్‌లో ఈ పాటను అప్ లోడ్ చేశారు.

ఇప్పటి వరకు మూడు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.లక్షల కొద్ది షేర్లు, కామెంట్లు వస్తున్నాయి.

తాజాగా పెళ్లి కూతురు ఈ పాటకు డాన్స్ వేయడంతో సోషల్ మీడియాలో ధూంధాం రేపింది.ఇంతకీ మోహన భోగరాజు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

నాని హీరోగా తెరకెక్కిన టక్ జగదీష్ సినిమాలో మోహన గానం టీజర్ ప్రారంభం నుంచి చివరి వరకు వినిపిస్తుంది.ఆమె గొంతు జనాలను మైమరిచేలా చేస్తుంది.మోహన తల్లికి సంగీతంపై మంచి పట్టు ఉంది.ఆమె నుంచే తనకు సంగీతం పట్ల మక్కువ పెరిగింది.చిన్న వయసులోనే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది.పలు టీవీ షోలలో పాల్గొని తన పాటలను వినిపించింది.

ఓసారి మ్యూజిక్‌ డైరెక్టర్‌ బాలాజీ.మోహన వాయిస్ విన్నాడు.

అనంతరం జైశ్రీరామ్‌ సినిమాలో సయ్యామమాసం అనే పాట పాడే అవకాశం ఇచ్చాడు.

అయినా తనకు పెద్దగా గుర్తింపు రాలేదు.ఆ తర్వాత కీరవాణిని కలిసి తను పాడిన పాటలను వినిపించింది.ఆయనకు మోహన పాటలు బాగా నచ్చాయి.

కొద్ది రోజుల తర్వాత మోహనకు కీరవాణి ఫోన్ చేశాడు.బాహుబలిలో మనో….

హరి అనే పాట పాడించాడు.ఈ పాటతో తనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి.

ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.అలాగే ప్రైవేటు ఆల్బమ్స్ కూడా చేస్తుంది.

మోహన హైదరాబాద్ అమ్మాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube