ఓరి దేవుడా: ఇంటి ముందు పార్క్ చేసిన కారు ఒక్కసారిగా ఎలా మాయమైందంటే..?!

భారీ వర్షాలకు ముంబై మరోసారి అతలాకుతలమవుతోంది.కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ముంబై ప్రజలను ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి.

 Ori Devuda How Did The Car Parked In Front Of The House Suddenly Disappea-TeluguStop.com

రుతుపవనాల ప్రభావంతో గత మూడు రోజులుగా ముంబై నగరంలో భారీవర్షాలు కురుస్తున్నాయి.వర్షానికి పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి.

వరదల వల్ల కార్లు, వాహనాలు, బస్సులు కొట్టుకుపోయాయి.దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు.

 Ori Devuda How Did The Car Parked In Front Of The House Suddenly Disappea-ఓరి దేవుడా: ఇంటి ముందు పార్క్ చేసిన కారు ఒక్కసారిగా ఎలా మాయమైందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓ వైపు కరోనా మరో వైపు వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.వర్షానికి కాలువలు పొంగిపొర్లడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

ఇప్పుడు ముంబైలో ఉండాలంటేనే చాలా మందికి భయం వేస్తోంది.దీంతో ముంబై నగరం చాలా ప్రమాదకరంగా తయారైంది.

తాజాగా ఓ వీడియో భయపెడుతోంది.

వీడియోలో ఓ ఇంటి ముందు ఓ కారు ఆపి ఉంది.అయితే ఆ కారు ఉన్నట్లుండి సింక్ హోల్ లో మునిగిపోయింది.4 రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.వర్షాల వల్ల చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.కుండబోత వర్షాలకు చాలా వరకూ ఆస్తి నష్టం వాటిల్లింది.కారు మునిగిపోయిన వీడియో ఘాట్కోవర్ ప్రాంతంలో జరిగింది.ఆపి ఉన్న కారు మట్టిలో మొదటగా ఉన్న చక్రాలు కూరుకుపోయాయి.

ఆ తర్వాత మెల్లగా వెనకవైపు కారు భాగం మునిగిపోయి పూర్తిగా కూరుకుపోయింది.

ఈ ఘటన ముంబైలో జరగడంతో కలకలం రేపింది.కారు ముందు భాగం, చ‌క్రాలు భారీ గోతిలోకి కూరుకుపోయింది.చూస్తుండగానే కొన్ని సెక‌న్ల‌లోనే కారు పూర్తిగా గోతిలోకి వెళ్లిపోయింది.

అయితే ఆ కారు పక్కనే ఉన్న కార్లు మాత్రం కూరుకుపోలేదు.ఆ కార్లు మాత్రం ఎటువంటి ఇబ్బందీ కలగలేదు.

ఇంటి ముందు కారు మాయమవడంతో కుటుంబీకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.చాలా మంది ఈ వీడియోను చూసి భయపడిపోతున్నారు.

ముంబైలో ఉండటం అంత ప్రమాదమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.వర్షాలకు ముంబై తల్లడిల్లుతోంది.

ప్రస్తుతం అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు.

#Video #Swallowed #Rain Effect #Mumbai #Parking

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు