ఇకమీదట వాట్సాప్ నుంచే ఆర్డర్లు, డెలివెరీ సేవలు..!

ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ను విచ్చల విడిగా వాడేస్తున్నారు.వాట్సాప్ కూడా రోజుకో సరికొత్త ఫీచర్ తో యూజర్లను ఆకర్షిస్తూ వస్తుంది.

 Orders And Delivery Services From Whatsapp From Now On , Whatsapp, New Features-TeluguStop.com

ఈ క్రమంలోనే వాట్సాప్ కొత్త రకం డెలివరీ సర్వీస్‌ లను తమ ప్లాట్‌ఫాం ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది.తాజాగా కేరళకు చెందిన మొదటి హైపర్‌ లోకల్‌ డెలివరీ స్టార్టప్‌ ఎరాండో (Errando) ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ బేస్డ్ డెలివరీ సర్వీసులను ప్రారంభించింది.

ఈథర్ ఈ సంస్థ సేవల కోసం ఫుడ్‌, స్టేషనరీ, మందులు, కిరాణ సరుకులు లేదా పికప్‌, డ్రాప్‌ సర్వీసుల కోసం కస్టమర్లు 7994834834 అనే నెంబర్‌కు వాట్సాప్ నుంచి హలో అని మెసేజ్‌ చేసి ఈ సేవలు పొందవచ్చని ఆ సంస్థ ప్రకటించింది.ఆ నెంబర్‌ నుంచి వచ్చే ఆటోమేటెడ్‌ మెసేజులు ఆర్డర్లను ప్లేస్ చేయడంలో కస్టమర్లను గైడ్‌ చేస్తాయి.

డెలివరీ లేదా పికప్‌ సేవల కోసం టైప్‌ చేసి మీ అడ్రస్‌ ను షేర్‌ చేయవచ్చు.నిజానకి ఈ సర్వీస్ ను ఆరేళ్ళ క్రితమే ప్రారంభించారు.అంటే 2016లోప్ ఫుడ్ అఫ్ టచ్ పేరుతో ఈ స్టార్టప్‌ను షమీర్‌ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ప్రారంభించారు.అప్పట్లో ఇది రెస్టారెంట్లు నుంచి ఫుడ్‌ మాత్రమే డెలివరీ చేసేది.

ఆ తర్వాత 2018లో Errando గా పేరు మార్చి కేరళలోని మూడు నగరాలకు దీని సేవలని విస్తరించారు.అలా మెల్లమెల్లగా 2020లో ఇది బెంగళూరులో కూడా ప్రారంభించారు.

ప్రస్తుతం కొచ్చి, కొళికోడ్‌, తిరువనంతపురం, బెంగళూరు నగరాల్లో సేవలందిస్తోంది.దక్షిణాదిన మరో ఆరు నగరాలు- హైదరాబాద్‌, చెన్నై, కోయంబత్తూరు, మైసూరు, మంగళూరు, త్రిస్సూరుకు సేవలను విస్తరిస్తోంది.ప్రెజెంట్ తాము ప్రతి నెలా 1.5 లక్షల ఆర్డర్లు పూర్తి చేస్తున్నామని షమీర్‌ తెలిపారు.అలాగే Errando సేవలను రోజుకు 2000 మంది కస్టమర్లు ఉపయోగిస్తున్నారు.

Telugu Delivery, Whatsapp-Latest News - Telugu

కరోనా అప్పుడు లాక్‌డౌన్‌ సమయంలో రోజుకు 3000 మంది ఈ సేవలు ఉపయోగించుకున్నారు.ఇదిలా ఉండగా కస్టమర్లు ఆటో జనరేటెడ్‌ పేమెంట్ లింక్ ఉపయోగించి పేమెంట్స్ చేయవచ్చన్నారు.వాట్సాప్ ఆధారిత సేవలు పొందడం వల్ల మరొక ఉపయోగం ఏంటంటే మీ ఫోన్లో ర రకరకాల యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే అవసరం ఉండకపోవడంతో పాటు, ఫోన్ యొక్క స్టోరేజ్‌ నిండిపోవడం, స్మార్ట్‌ ఫోన్‌ పనితీరు తగ్గడం లాంటి డిస్ అడ్వాంటెజెస్ కూడా ఉండవు అని షమీర్ గుర్తు చేసారు.

ప్రస్తుతం ఈ సేవలు ఇంగ్లిష్‌లోనే అందుబాటులో ఉండగా మరి కొద్ది రోజుల్లో మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విస్తరించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube