రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై రైలులోని అపరిశుభ్ర పదార్థాలు తిననవసరం లేదు

ఇండియాలో రైలు ప్రయాణికుల సంఖ్య భారీగా ఉంటుందనే విషయం తెల్సిందే.మద్యతరగతి విమానంగా పేరున్న రైలులో భోజనం విషయంలో మాత్రం చాలా దారుణమైన విమర్శలు ఉన్నాయి.

 Order Delicious Food In Train Journey On The Go And Get Food Delivered-TeluguStop.com

రైల్వే బోజనం ఒక చెత్త పదార్థం అంటూ చాలా మంది చాలా రకాల ప్రచారాలు చేస్తున్నారు.ఎవరేం ప్రచారం చేసినా, ఎంతగా అనుకున్నా కూడా రైల్వే శాఖ మాత్రం తమ ప్రయాణికులకు ఇస్తున్న బోజనం విషయంలో క్వాలిటీని మాత్రం చూపించడం లేదు.

అత్యంత దారుణమైన పదార్థాలు అమ్ముతున్నారు.నాణ్యత లోపం పలు సార్లు బయటకు వచ్చింది.

అయినా మార్పు మాత్రం శూన్యం.

అందుకే రైలులో ఆహార పదార్థాలు తీసుకునే వారి సంఖ్య చాలా తగ్గింది.అయితే కొందరు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ చేయలేక అదే బోజనంను చేస్తూ ఉన్నారు.తాజాగా రైలు ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కొత్త యాప్‌ను తీసుకు వచ్చింది.

రైలులో ఆహారం నచ్చని వారికి బయట ఆహారం ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.డొమినోస్‌ వంటి వారితో ఒప్పందం కుదుర్చుకుని ప్రయాణికులకు ఇష్టమైన ఆహారంను రైల్వే స్టేషన్‌లో ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.

పెద్ద పెద్ద రైల్వే స్టేషన్‌లో ఇవి ఏర్పాటు అవుతున్నాయి.

రైలులో ప్రయాణిస్తున్న సమయంలో మనకు కావాల్సిన ఆహారం ఏ రైల్వే స్టేషన్‌లో ఉందో చూసుకుని, అక్కడకు గంటలో చేరుకుంటాం అనగా దాన్ని ఆర్డర్‌ చేయాల్సి ఉంటుంది.రైలు వెళ్లే సమయంకు పార్శల్‌ సిద్దంగా ఉంటుంది.ఆ పార్శిల్స్‌ను రైలులో ఉండే వారికి సంబంధించిన సిబ్బంది సరఫరా చేస్తూ ఉంటారు.

అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ క్యాటరింగ్‌ యాప్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది.దీంతో రైల్వే ప్రయాణికులు మరింత ఆనందంగా, సుఖమయ ప్రయాణంను పొందుతారని ఇండియన్‌ రైల్వే శాఖ అంటోంది.

ఇందులో ఏ స్థాయి ప్రమాణాలు పాటిస్తున్నారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube