పిల్ల చూడడానికి ఒకే.. కానీ చేసే పనులే చాలా గలీజ్....

ఈ మధ్యకాలంలో కొందరు డబ్బు సంపాదించడానికి దొంగతనాలను వృత్తిగా చేసుకుంటున్నారు. మరికొందరు తాము చేసేటువంటి పనుల వల్ల వచ్చే ఆదాయం సరిపోక అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి దొంగతనాలను వృత్తిగా చేసుకుంటున్నారు.

 Orchestra Singer Archana Barua Became A Thief For Money Income,  Singer Archana-TeluguStop.com

 కాగా తాజాగా ఓ అందమైన గాయని డబ్బు సంపాదించడం కోసం దొంగగా మారి పోలీసులకు చిక్కిన ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కలకలం సృష్టించింది…

వివరాల్లోకి వెళితే ‘అర్చన బరువా”  అనే ఓ యువతి స్థానిక ముంబై నగర పరిసర ప్రాంతంలో నివాసముంటోంది. అయితే ఈమె అప్పుడప్పుడు కుటుంబ పోషణ నిమిత్తమై పెళ్ళిళలో మరియు  ఇతర వేడుకలలో ఆర్కెస్ట్రా గ్రూపులో సింగర్ గా పని చేసేది.

ఈ మధ్య కాలంలో ఈ అమ్మడికి ఆర్కెస్ట్రా గా పనిచేసిన సమయంలో వచ్చేటటువంటి డబ్బులు సరిపోక దొంగగా మారింది.ఈ క్రమంలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడి దాదాపుగా పది లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలు అపహరించింది.

దీంతో ఈ అమ్మడు దొంగతనాలకి పాల్పడిన  ప్రదేశాల్లో ఉన్నటువంటి సీక్రెట్ కెమెరాల ద్వారా ఇటీవలే పోలీసులు గుర్తించారు.

దొంగ వివరాలు తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వెంటనే ఈ అమ్మడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

 అయితే ఈ విచారణలో అర్చన బరువా దొంగతనం చేసినటువంటి సొమ్ముతో జల్సాలు చేసేదని ఈ క్రమంలో దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలకు విమానంలో ప్రయాణించేదని తెలిపింది. అంతేగాక పలు పర్యాటక ప్రాంతాలలో దొంగతనాలకు కూడా పాల్పడినట్లు తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube