అప్పట్లో ఈ యంగ్ హీరోయిన్ ఆ క్రికెటర్ తో ప్రేమలో పడిందట.... కానీ...

తెలుగులో 2010వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన “ఆరెంజ్” చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.కానీ ఈ చిత్రం మ్యూజికల్ గా  మాత్రం బాగానే హిట్ అయ్యింది.

 Orange Movie Fame Shazahn Padamsee Love Affair With Indian Cricket Bowler, Shaza-TeluguStop.com

అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించగా జెనీలియా, షాజన్ పదంశ్రీ, సంచిత శెట్టి, మధురిమ, తదితరులు హీరోయిన్లుగా నటించారు.అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ లవర్ పాత్రలో నటించి బాగానే అలరించిన షాజన్ పదంశ్రీ మాత్రం ఆశించిన స్థాయిలో కెరియర్లో హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.

దీంతో ఈ అమ్మడు తాను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా గాసిప్స్ మరియు రూమర్లతోనే బాగా పాపులర్ అయింది.

అయితే తాజాగా షాజన్ పదంశ్రీ గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వార్త ఏమిటంటే అప్పట్లో ఈ అమ్మడు భారత క్రికెట్ జట్టు కి పేస్ బౌలర్ గా సేవలు అందించిన ఓ ప్రముఖ క్రికెటర్ తో షాజన్ పదంశ్రీ ప్రేమలో పడిందని తొందరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట.కానీ అనుకోకుండా షాజన్ పదంశ్రీ  ప్రియుడు క్రికెట్ బెట్టింగ్ అసాంఘిక కార్యకలాపాలలో పట్టుబడడంతో క్రికెట్ బోర్డు అతడిని నిషేధించిందట.

దీంతో వీరిద్దరి పెళ్లి కూడా ఆగిపోయిందని కొందరు చర్చించుకుంటున్నారు.ఇది జరిగిన కొంతకాలం తరువాత షాజన్ పదంశ్రీ కూడా సినిమాలపై దృష్టి సారించినప్పటికీ పెద్దగా రాణించలేక పోయింది.

దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి ఎలాంటి సినిమా అవకాశాలు లేవు.దాంతో ఇంటి పట్టునే ఖాళీగా ఉంటుంది.

అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వంటి స్టార్ హీరోతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది.కాగా ఆ మధ్య విక్టరీ వెంకటేష్ మరియు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తదితరులు కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం “మసాల” లో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ చిత్రం కూడా డిజాస్టర్ కావడంతో ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube