ఒక్క సినిమాతోనే పత్తా లేకుండా పోయిన ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా..?

Orange Movie Fame Sanchita Shetty Bagged 5 Offers In Tamil

చలన చిత్ర పరిశ్రమకు వచ్చి రావడంతోనే స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకుని అనుకోకుండా తళుక్కున మెరిసి తెరమరుగైన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.అయితే ఇందులో తెలుగులో ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన “ఆరెంజ్” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్లుగా పరిచయమైన మలయాళ బ్యూటీ “సంచిత శెట్టి” కూడా ఈ కోవకే చెందుతుంది.

 Orange Movie Fame Sanchita Shetty Bagged 5 Offers In Tamil-TeluguStop.com

కాగా సంచిత శెట్టి 2006వ సంవత్సరంలో “ముంగారు మలై” అనే కన్నడ చిత్రం ద్వారా సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైంది.ఈ క్రమంలో “ఆరెంజ్” చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో ఈ అమ్మడికి తెలుగులో హీరోయిన్ గా గుర్తింపు లభించలేదు.

దీంతో చేసేదేమీలేక మూట ముల్లె సర్దుకొని మళ్ళీ సంచిత శెట్టి చెన్నై కి వెళ్లి పోయింది.అయితే తెలుగులో ఈ అమ్మడికి పెద్దగా సినిమా అవకాశాలు తలుపు తట్టనప్పటికీ తమిళంలో మాత్రం వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.

 Orange Movie Fame Sanchita Shetty Bagged 5 Offers In Tamil-ఒక్క సినిమాతోనే పత్తా లేకుండా పోయిన ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ భాషలో దాదాపుగా 5 చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఇందులో ఇప్పటికే “పళ్ళు పద్మ పతుక” అనే చిత్రం షూటింగ్ పనులను పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.

కాగా మరో నాలుగు చిత్రాలు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుండగా ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా కొంతకాలం పాటు తాత్కాలికంగా నిలిపి వేశారు.

దీంతో అప్పుడప్పుడు సంచిత శెట్టి సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.ఈ క్రమంలో పలు రకాల ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ తన అందమైన ఫోటోలు షేర్ చేస్తోంది.కాగా ఇటీవలే ఈ అమ్మడు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకుంది.

అంతేకాకుండా ఈ విషయాన్ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేస్తూ కరోనా వాక్సిన్ తీసుకోవడానికి ఏమాత్రం భయపడవద్దని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది.

#OrangeSanchita #Orange #Sanchita Shetty #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube