ప్రభాస్ నెంబర్ 2 హీరోనా? ఎన్టీఆర్, బన్నీ స్థానాలు మరీ దారుణం?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే వారి అభిమానులు మా హీరో గొప్ప మా హీరో నెంబర్ వన్ అని చెబుతూ ఉంటారు.అయితే చాలామందికి ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది.

 Ormax Media Most Popular Male Stars Details, Tollywood,ormax,vijay,prabhas,ntr,allu Arjun, Mahesh Babu, Pawan Kalyan, Ajith Kumar, Yash , Akshay Kumar, Samantha, Number One Hero-TeluguStop.com

అలాగే ఎవరు నెంబర్ వన్ హీరో ఆ తర్వాత స్థానాల్లో ఎవరు ఉన్నారు అన్న విషయం తెలుసుకోవాలి అన్న ఆసక్తి కూడా ఉంటుంది.తాజాగా ఆ విషయాలను ఓర్ మ్యాక్స్ సంస్థ వెల్లడించింది.

సినిమాలకు సంబంధించిన బాక్సాఫీస్ విశ్లేషణలు రేటింగ్స్ ఇచ్చే ఓర్ మ్యాక్స్ సంస్థ మోస్ట్ పాపులర్ మెయిల్ స్టార్ సర్వే చేసింది.మరి ఈ సర్వేలో టాప్ టెన్ లో పలువురు హీరోని నిలిచారు.

 Ormax Media Most Popular Male Stars Details, Tollywood,ormax,vijay,prabhas,ntr,allu Arjun, Mahesh Babu, Pawan Kalyan, Ajith Kumar, Yash , Akshay Kumar, Samantha, Number One Hero-ప్రభాస్ నెంబర్ 2 హీరోనా ఎన్టీఆర్, బన్నీ స్థానాలు మరీ దారుణం-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ హీరోల లిస్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ సర్వేలో టాప్ వన్ లో తమిళ నటుడు విజయ్ అగ్రస్థానంలో నిలిచారు.ఆ తర్వాత రెండవ స్థానంలో టాలీవుడ్ హీరో ప్రభాస్ నిలిచారు.ఇక మూడవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, నాలుగవ స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు.

ఇక ఐదవ స్థానంలో యష్, ఆరవ స్థానంలో అక్షయ్ కుమార్, ఏడవ స్థానంలో రామ్ చరణ్, ఎనిమిదవ స్థానంలో మహేష్ బాబు, తొమ్మిదవ స్థానంలో సూర్య, ఇక చివరిగా పదవ స్థానంలో అజిత్ కుమార్ నిలిచారు.కాగా ఓర్ మ్యాక్స్ సంస్థ ఆగస్టు 2022 వరకు ఆల్ ఇండియా లెవెల్ లో తీసుకున్న గణాంకాలివి.

Telugu Ajith Kumar, Akshay Kumar, Allu Arjun, Mahesh Babu, Number, Ormax, Pawan Kalyan, Prabhas, Samantha, Tollywood, Vijay, Yash-Latest News - Telugu

మోస్ట్‌ పాపులర్‌ ఫిమేల్‌ స్టార్స్‌,మోస్ట్‌ అవైటెడ్‌ తెలుగు ఫిల్మ్స్‌,మోస్ట్‌ అవైటెడ్‌ హిందీ ఫిల్మ్స్‌ ఇలా పలు కేటగిరీల వివరాలను ఓర్‌మ్యాక్స్‌ సోషల్‌ మీడియాలో విడుదల చేసింది.ఇక హీరోయిన్ల జాబితా విషయానికి వస్తే.మోస్ట్‌ పాపులర్‌ ఫిమేల్‌ స్టార్స్‌ టాప్‌ 10 జాబితాలో సమంత నెంబర్ 1 గా నిలిచింది.ఇక మిగిలిన తొమ్మిది స్థానాలలో అలియా భట్‌, నయనతార, కాజల్‌ అగర్వాల్‌, దీపికా పదుకొణె, రష్మిక, కీర్తి సురేశ్‌, కత్రినా కైఫ్‌, పూజా హెగ్డే, అనుష్క శెట్టి నిలిచారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన మోస్ట్‌ పాపులర్‌ మేల్‌ స్టార్‌ జాబితాలో ప్రభాస్‌ అగ్రస్థానంలో నిలిచారు.ఆ తర్వాతి స్థానాల్లో ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, మహేశ్‌బాబు, పవన్‌ కల్యాణ్‌ హీరోలు నిలిచారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube