పోడు భూముల సమస్యల పరిష్కారానికి ఒక్కటవుతున్న ప్రతిపక్షాలు

గత కొన్ని సంవత్సరాలుగా పోడు భూముల సమస్య అనేది తెలంగాణ రాకముందు కూడా పరిష్కారానికి నోచుకోని విషయం మనకు తెలిసిందే.అయితే ఇక తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఈ సమస్య అనేది ఇంకా అపరిష్కారం గానే ఉంది.

 Oppositions Uniting To Solve Land Issues/bjp Party, Trs Party, Telangana Congres-TeluguStop.com

అయితే  అటవీ అధికారుల వేధింపులు తాళలేక కొంత మంది పోడు భూముల ఆధారంగా వ్యవసాయం చేసే రైతులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ సంఘటనలు ఇటీవల చాలా వరకు జరిగిన పరిస్థితి ఉంది.కొన్ని నియోజకవర్గాలలో అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం అటవీ అధికారులను కోరినా అంతగా పరిష్కారం లభించిన సంఘటనలు లేవు.

అయితే కెసీఆర్ తన ఎన్నికల ప్రచారంలో కూడా పోడు భూముల సమస్యకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చినా ఆ హామీ బుట్ట దాఖలైన పరిస్థితి ఉంది.అయితే తాజాగా మంత్రులతో  కమిటీ వేసినా కమిటీ తొలి సమావేశం కూడా జరగలేదు.

కమిటీ ముఖ్య ఉద్దేశ్య మేమిటో అనేది తెలిస్తే పోడు భూముల రైతులు కూడా ఎంతో కొంత తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆలోచనతో కొంత ఆత్మస్థైర్యంతో ఉంటారు.అయితే ఈ పోడు భూముల సమస్యను పరిష్కరించాలని వచ్చే నెల 5 నుండి పాదయాత్ర చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.

తద్వారా ప్రభుత్వం కనువిప్పు కలిగి రైతులకు న్యాయం జరిగుతుందని ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోతే ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది.ప్రతిపక్షాల ప్రకటనపై ఇంకా ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి స్పందన రాకున్నా మరి కేవలం స్పందిస్తారనేది   చూడాల్సి ఉంది.

అయితే పోడు భూముల సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నదే ప్రతిపక్షాల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.మరి ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube