ఒక్కటవుతున్న ప్రతిపక్షాలు... మూకుమ్మడి పోరుకు సిద్దమైనట్టేనా?

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితి ఉంది.ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేయడానికి ప్రతిపక్షాలు సిద్దమైనట్టు తెలుస్తోంది.

 Oppositions Uniting Are They Ready For A Mass War-TeluguStop.com

ఇప్పటికే రకరకాల విధాలుగా ఇటు కాంగ్రెస్ అవచ్చు, బీజేపీ అవచ్చు రకరకాల ప్రభుత్వ విధానాలపై పదునైన విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.అయితే ఇప్పటి వరకు ఇటు తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీ, ఇతర ప్రజా సంఘాల నేతలు వడి వడిగా నిరసనలు తెలియజేయగా ఇప్పుడు అందరు కలిసి నిరసన జ్వాలలు తెలియజేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

దీనికి తొలి అడుగుగా నేడు ఇందిరా పార్కు వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్, టీజేఎస్, తెలంగాణ ఇంటి పార్టీ ఇతర ప్రజా సంఘాల నేతలు నిరసన చేపట్టనున్నారు.ఇక ప్రతిపక్షాల పోరు చాలా విషయాలపై ఇక సుదీర్ఘంగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

 Oppositions Uniting Are They Ready For A Mass War-ఒక్కటవుతున్న ప్రతిపక్షాలు… మూకుమ్మడి పోరుకు సిద్దమైనట్టేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu @bjp4telangana, @trspartyonline, #telanganacongress-Political

ఎందుకంటే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పై కొంత వ్యతిరేకత మొదలయిందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.అందుకే ఒక్కటిగా అందరూ  పోరాడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అందుకే రానున్న రోజుల్లో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఆసరాగా చేసుకొని ప్రభుత్వం పై పోరాటానికి తగిన వ్యూహాల్ని సిద్దం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అంతేకాక ఒక్కో ఎజెండాతో ముందుకెళ్తూ ఆ సమస్యకు ప్రభుత్వం నుండి పరిష్కారం దొరకకపోతే ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.

ఇక మరి ప్రభుత్వం ప్రతిపక్షాల వైఖరి పట్ల ఎలా స్పందిస్తుందనేది మనం చూడాల్సి ఉంది.అయితే ఇప్పటికే దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటున్న నేపథ్యంలో ప్రతిపక్షాల నిరసలను కేసీఆర్ ప్రభుత్వం అభాసుపాలు చేస్తుందో ప్రస్తుతం ఆసక్తి కరంగా మారిన పరిస్థితి ఉంది.

#@trspartyonline #@BJP4Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు