ఆ విష‌యంలో కేటీఆర్ మీద ఫైర్ అవుతున్న ప్ర‌తిప‌క్షాలు, సోష‌ల్ మీడియా..

టీఆర్ఎస్ పార్టీలో డైనమిక్ లీడర్ కేటీఆర్ అంటూ ఆ పార్టీ వర్గాలు పేర్కొంటాయి.ట్విట్టర్ వేదికగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా మనం చూడొచ్చు.

 Oppositions Are Firing On Ktr In That Regard, Social Media  Ktr, Politics,tg New-TeluguStop.com

అయితే, తాజాగా ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పెట్టిన ఓ పోస్టు ఆయనను విమర్శలపాలు చేస్తోంది.ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.

కరోనా వైరస్ కట్టడికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు వ్యాక్సిన్ తీసుకోవడం ముఖ్యం.కాగా, మంత్రి కేటీఆర్ తాజాగా రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్ వేదికగా పోస్టు చేసి సెకండ్ డోస్ కంప్లీట్ అని పేర్కొన్నాడు.అయితే, కేటీఆర్ తన ఇంట్లోనే వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల ప్రతిపక్షాలు, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి టీకా తీసుకుంటుండగా, కేటీఆర్ మాత్రం ఇంట్లోనే ఉండి వ్యాక్సిన్ తీసుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Cm Kcr, Congress, Ktr Tweets, Ktr, Netizens Ktr, Tg-Telugu Political News

జనాలు టీకా కోసం లైన్‌లో నిలబడి తమ వంతు కోసం ఎదురు చూస్తుండగా కేటీఆర్ ఇలా ఇంట్లో తీసుకోవడాన్ని బట్టి చూస్తే మంత్రికో రూల్.సామాన్య ప్రజానీకానకో రూల్ ఉందన్న చర్చ వస్తుందని కొందరు నెటిజన్లు అంటున్నారు.ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం లేకుంటే కనీసం యశోద ఆస్పత్రికైనా వెళ్లి టీకా తీసుకోవాల్సింది కదా అని మరి కొందరు నెటిజన్లు కేటీఆర్‌కు సూచిస్తున్నారు.

ప్రజలు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకునేందుకు నానా కష్టాలు పడుతుంటే మా మంత్రి తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ టీకా తీసుకున్నాడంటూ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.మంత్రి ఇంట్లోకి వ్యాక్సిన్ వచ్చినప్పుడు, నిరుపేద ప్రజల ఇళ్లలోకి వ్యాక్సిన్ ఎందుకు రాదు అని ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube