బీజేపీలో చేరాక తీన్మార్ మల్లన్నపై మొదలైన వ్యతిరేకత..అసలు కారణం ఇదేనా?

రాజకీయాలలో చాలా రకాల హామీలను రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఇస్తుంటారు.కాని ఇచ్చిన హామీలన్నీ ఏ రాజకీయ నాయకుడు కూడా నెరవేర్చరు.

 Opposition To Teenmar Mallanna After Joining Bjp..is This The Real Reason Detail-TeluguStop.com

ఎందుకంటే గెలుపు కోసం ప్రజాకర్షక హామీలు ఇవ్వటం అనేది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నైజం.అంతేకాక సిద్దాంతాల పేరుతో రాజకీయ నాయకుడిగా పేరు గడించడం కోసం ప్రయత్నం చేసి పేరు గడించిన తరువాత రాజకీయ ఎదుగుదలకు సహకరించే పార్టీలో చేరటం అన్నది రాజకీయాల్లో షరామామూలే.

అయితే బహుజన వాదంతో రాజకీయాలలోకి వచ్చిన తీన్మార్ మల్లన్న కేసీఆర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తూ బహుజనులకు న్యాయం జరగడమే నా ప్రధాన ఎజెండా అని ఏ ఒక్క రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశ్యం లేదని మొదట మల్లన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

అయితే ఇక కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడుతుండటంతో ఇక నిరుద్యోగులు సైతం తీన్మార్ మల్లన్నకు భారీగా మద్దతు పలికారు.

అయితే చాలా మంది ఒంటరిగా పోరాటం చేస్తారని భావించినా చివరికి బీజేపీ పార్టీలో చేరడంతో ఇక తీన్మార్ మల్లన్నకు ఇప్పటి వరకు మద్దతిచ్చిన వారందరు కూడా పెద్ద ఎత్తున మల్లన్న బీజేపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది.

Telugu @bjp4telangana, @cm_kcr, Bahujan, Bjp, Telangana Bjp, Telangana, Trs-Poli

బహుజన వాదం పేరుతో రాజకీయం చేసి మతతత్వ పార్టీ అయిన బీజేపీలో చేరటం బహుజన వాదాన్ని బహుజనులను అవమాన పర్చడమే అని బహుజన వాదం మద్దతుదారులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.రాజకీయాల గురించి బహుజనవాదాన్ని ఒక పావుగా వాడుకున్నారని భీకర స్వరంతో పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న పరస్థితి ఉంది.అయితే ఈ విషయంపై మల్లన్న ఎక్కడా కూడా బహిరంగంగా స్పందించకపోయినా బీజేపీలో చేరడంతో తన స్వంత ఇమేజ్ కి గండి కొట్టుకున్నారనే భావనను కొందరు సన్నిహితులు మల్లన్న వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube