కాచుకో మోడీజీ.. "స్టార్ట్ ది గేమ్ " !

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని( PM Modi ) ఎలాగైనా గద్దె దించాలని విపక్షాలన్నీ గట్టి పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాయి.

 Opposition Target On Modi Details, Bjp, Congress, National Politics, Tmc, Opposi-TeluguStop.com

అయితే ఎవరికి వారు మోడీ సర్కార్ పై తిరుగుబాటు జెండా ఎగురవేస్తే ప్రయోజనం లేదని అందరూ కలిసికట్టుగా పోరాడినప్పుడే మోడీ సర్కార్ కు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నాయి విపక్ష పార్టీలు.అయితే ఏ పార్టీతో ఏ ఏ పార్టీలు కలుస్తాయనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నే.

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, సమాజ్ వాది పార్టీ, ఎన్సీపీ, బి‌ఆర్‌ఎస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ.ఇలా అన్నీ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నప్పటికి ఈ పార్టీలన్నీ ఒకే తాటిపైకి రావడమనేదే పెద్ద టాస్క్ లా మారింది.

Telugu Amith Sha, Congress, Mamata Banerjee, National, Nitish Kumar-Politics

కొన్నిసార్లు విపక్షాల ఐక్యత కోసం మమతా బెనర్జీ( Mamata Banerjee ) ప్రయత్నిస్తే, మరోవైపు నుంచి జేడీయూ అధినేత నితీశ్ కుమార్( Nitish Kumar ) ప్రయత్నిస్తున్నారు.ఇంకోవైపు నుంచి కేజ్రివాల్ ( Kejriwal ) కూడా విపక్షాల ఐక్యత కోరుకుంటున్నారు.కానీ వీరంతా కూడా ఎవరికి వారే ఎమునాతీరే అన్నట్లుగా స్వతంత్రంగా ముందుకు సాగుతున్నారు తప్పా.అందరూ కలిసి మాత్రం ముదుకు సాగడం లేదు.దీంతో విపక్షాల ఐక్యత అనేది జస్ట్ మాటల వరకే అనే భావన కలుగుతోంది.దాంతో ప్రజల్లో ఇలాంటి భావనా కలుగక ముందే విపక్షాలంతా ఒక్కటే అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడాలంటే.

అన్నీ పార్టీలు కలిసి పోరాటం సాగించాల్సిఉంటుంది.

Telugu Amith Sha, Congress, Mamata Banerjee, National, Nitish Kumar-Politics

ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలను చూస్తుంటే ఆ దిశగా అడుగులు పడుతున్నట్లే కనిపిస్తోంది.జూన్ 12న దాదాపు 20 విపక్ష పార్టీలు బిహార్ లోని పాట్నాలో సమావేశం కానున్నాయి.కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జేడీయూ, ఆప్.వంటి కీలక పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి.విపక్షాల ఐక్యత కోసం జరుగుతున్నా మొదటి పెద్ద సమావేశం కావడంతో.

ఈ సమావేశంలో ఎలాంటి చర్చలు జరగనునయనేది ఆసక్తికరంగా మారింది.ఒకవేళ ఈ సమావేశంలో అన్నీ పార్టీలు ఏకాభిప్రాయంతో నిలిస్తే బీజేపీ కష్టమే అని చెప్పాలి.

దీంతో అసలైన గేమ్ జూన్ 12 నుంచి మొదలు కాబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.విపక్షాలన్నీ కలిసి వచ్చిన మోడీని గద్దె దించడం జరగదని పట్టుదలతో ఉన్న బీజేపీకి.

ఇకపై విపక్షాలు వేసే ప్రతి అడుగు కూడా గట్టిగానే నష్టం చేకూర్చే అవకాశం ఉంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube