పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా పోటీ నుంచి తప్పించే ప్రయత్నం

ఏపీ రాజకీయాలలో ఇంత వరకు వచ్చిన సంప్రదాయ రాజకీయ పార్టీలకి పోటీగా మూడో శక్తిగా ప్రజల ముందుకి వచ్చిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్.రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ ప్రస్తానం మొదలెట్టిన పవన్ కళ్యాణ్ తాజా ఎన్నికలలో ఓటమి పాలైన ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీ మీద సానుభూతి మధ్యలో గెలిచే స్థాయిలో ప్రభావం చూపించాలేకపోయిన కూడా ఓటు బ్యాంకు వరకు ప్రభావం చూపించి.

 Opposition Parties Play Political Game On Janasena Pawan-TeluguStop.com

ప్రజా జీవితంలోకి వెళ్ళడానికి కావాల్సిన బలమైన పునాదులు వేసుకున్నారు.ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మరో పదేళ్ళు ఏపీలో జెండా పాతాలని చూస్తుంది.

ఇక తనకి ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీ పార్టీని భూస్థాపితం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు.ఇలాంటి సమయంలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఏపీ ప్రజలకి జనసేన కనిపిస్తుంది.

ఇక చంద్రబాబు తర్వాత టీడీపీ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం అనే మాట బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో జనసేన కచ్చితంగా రాబోయే రోజుల్లో బలమైన శక్తిగా మారుతుంది అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ జనాల మధ్యలో ఉండి ప్రజా సేవలో భాగం అయితే కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలని బలంగా ప్రశ్నిస్తారు.

ప్రశ్నించే సమయంలో పవన్ కళ్యాణ్ మీద కక్ష పూర్తి చర్యలకి పాల్పడితే అది ప్రభుత్వానికి మైనస్ గా మారుతుంది.ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ప్రజలలో ఉండకుండా మళ్ళీ సినిమాల వైపు వెళ్ళేలా చేస్తే తమకి ఎలాంటి సమస్య ఉండదని ప్రధాన పార్టీలన్నీ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో తమ అనుకూల మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ సినిమాల వైపు ద్రుష్టి పెడుతున్నాడు అని పదే పదే ప్రచారం చేయడం ద్వారా ప్రజల ద్రుష్టి అతని మీద లేకుండా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.మరో పవన్ కళ్యాణ్ జరుగుతున్న ఈ రకమైన దాడి నుంచి ఎలా తట్టుకొని నిలబడతారు అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube