తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతూ హీటెక్కుతున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అన్ని ప్రతిపక్షాలు కేసీఆర్ మూకుమ్మడి దాడి చేస్తూ టీఆర్ఎస్ పై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ఇక ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మరింతగా బలపడేందుకు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల స్పందించకపోయినా తెర వెనుక వ్యూహం రచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు రానున్న రోజుల్లో మరింత భీకర రీతిలో మారే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఎంతగా ప్రతిపక్షాలు ఈ విషయంలో సఫలమవుతాయానే విషయాన్ని మనం ఇప్పుడే స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.అయితే ఈ వ్యతిరేక పరిస్థితుల్లో కెసీఆర్ ఎలా నడుచుకుంటారనేది అందరూ ఒక్కసారిగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ప్రతిపక్షాలు రానున్న రోజుల్లో మరింతగా రాజకీయ వేడిని పెంచే అవకాశం ఉన్న తరుణంలో ఇక ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ తో కెసీఆర్ మంతనాలు జరిపారనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరోసారి కెసీఆర్ ప్రెస్ మీట్ తో సంచలనాలు రేపే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.అయితే ప్రతిపక్షాలు మాత్రం తగ్గేదే లే అన్న రీతిలో వ్యవహరిస్తూ ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తూ ఇక ఎలాగైనా టీఆర్ఎస్ అసెంబ్లీ స్థానాలు తగ్గాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ బలంగా ఉన్న నియోజకవర్గాలలో ప్రతిపక్షాలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా ప్రతిపక్షాల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయనేది చూడాల్సి ఉంది.








