ఆపరేష్ నంది బాబు పై ఐవైఆర్ సంచలన కామెంట్స్     2018-07-01   00:00:11  IST  Bhanu C

ఏపీ ప్రభుత్వ సీఎస్ గా పని చేసి ఆపై చంద్రబాబు కోరికపై బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ గా భాద్యతలని స్వీకరించి చంద్రబాబు కి అత్యంత సన్నిహిత వ్యక్తిగా పేరు ఉన్న ఐవైఆర్ కృష్ణారావు…తరువాతి కాలంలో చంద్రబాబు ని విభేదించిన విషయం అందరికీ తెలిసిందే..అప్పటి నుంచీ ఇప్పటి వరకూ చంద్రబాబు పై లెక్కలేనన్ని ఆరోపణలు..ఎన్నో నిందలు వేస్తూ చంద్రబాబు ప్రతిష్టని ఎదో రకంగా దెబ్బ తీయాలని చూస్తున్న ఐవైఆర్ ప్రతీ రోజు ఎదో ఒక వింత కొటేషన్స్ పెడుతూ చంద్రబాబు పై ఆరోపణలు గుప్పిస్తునే ఉన్నారు ఈ తరుణంలో మళ్ళీ ఐవైఆర్ వింత వ్యాఖ్యలతో మీడియా ముందుకు వచ్చారు..ఆపరేషన్ నంది అంటూ ఐవైఆర్ చేసిన విమర్శలు విమర్సకులని సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.

40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న ఏపీ సీఎం చంద్రబాబు కి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎపీకి వాటి వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది తెలియకుండా ఉంటుందా..? అవన్నీ తెలియకుండానే ఎన్నేళ్ళు రాజకీయాలలో ఉండగలరా జాతీయ స్థాయిలో చక్రం తిప్పగాలరా..? కానీ ఐవైఆర్ మాత్రం చంద్రబాబు పై బురద చల్లడానికి పూటకో మాట మాటకో వేషం వేస్తూ వైసీపి వాయిస్ వినిపిస్తున్నారు..బాబు పై విమర్శలు గుప్పిస్తున్నారు.చంద్రబాబు ప్రభుత్వంలోని టీడీపీ నేతలు విపరీతమైన అవినీతికి పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు..అయితే తాజాగా ఐవైఆర్ చంద్రబాబు పై చేసిన ఆరోపణలు చాలా వింతగా ఉన్నాయి..