టీడీపీ కొత్త ఎత్తు..ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టబోతోందా ..  

Operation Akarsh Starts Nara Chandrababu Naidu-

ప్రస్తుత రాజకీయాల్లో పోటీ వాతావరణం ఎక్కువ కనిపిస్తోంది.గత ఎన్నికల కంటే ఈ సరి పోటీ క్లిష్టంగా ఉండేలా కనిపిస్తుండడంతో అన్ని పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.ఇక అధికార పార్టీ టీడీపీ అయితే మరింత రాజకీయ పట్టు పెంచుకుని పక్క పార్టీలకు చుక్కలు చూపించాలని చూస్తోంది..

Operation Akarsh Starts Nara Chandrababu Naidu--Operation Akarsh Starts Nara Chandrababu Naidu-

అందుకే ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో మరికొంతమంది నేతలను పార్టీలోకి చేర్చుకుని తమ బలం మరింత పెంచుకోవాలని చూస్తోంది.టీడీపీ చేపట్టనున్న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్-2 జాబితాలో ప‌లువురు సీనియ‌ర్లు ఉన్నట్లు తెలుస్తోంది.పక్క పార్టీల నుంచి వారికి ఆఫర్లు రాకముందే టీడీపీ బుట్టలో వేసుకోవాలని చూస్తోంది.

శ్రీకాకుళం జిల్లానుంచి కొండ్రుముర‌ళీని చేర్చుకోవాలని భావిస్తుండగా.విశాఖ‌ నుంచి స‌బ్బం హ‌రితోపాటు.కొణ‌తాల రామకృష్ణ టార్గెట్‌గా ఉన్నట్లు సమాచారం.

స‌బ్బం హ‌రికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే సీటు, కొణ‌తాలకు అన‌కాప‌ల్లి పార్లమెంట్ సీటు ఇచ్చే అవ‌కాశం కనిపిస్తోంది.ఇక తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్‌ను పార్టీ లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం.ఆయనకు రాజ‌మండ్రి ఎంపీ, లేదా ఎమ్మెల్యే సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది..

దీంతో పాటు వైసీపీకి రాజకీయంగా బలమైన రాయలసీమలోనూ టీడీపీ తన ప్రభావం చూపించి జగన్ కి ఝలక్ ఇవ్వాలని చూస్తోంది.ముందుగా వైసీపీకి కంచుకోట వంటి క‌డ‌ప జిల్లాలో పాగా వేయాల‌నీ చూస్తోంది.ఇప్పటికే ఆదినారాయణ రెడ్డిని పార్టీలొ చేర్చుకొని మంత్రి పదవి కూడా బట్టబెట్టింది.

అలాగే మాజీ మంత్రి డిఎల్ ర‌వీంద్రారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాల‌ని చూస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నా ఎలాగైనా ఒప్పించి సైకిల్ ఎక్కించాలని చూస్తోంది.అలాగే… మైనారిటీ వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లాను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు చూస్తోంది.

అలాగే.మాజీ సీఎం కోట్ల విజ‌య‌భాస్కర్‌ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికోసం టీడీపీ ఎప్పట్నుంచో ఎదురుచూస్తోంది.కాగా డిప్యూటీ సీఎం కేఈ వ్యతిరేకించడంతో వెన‌క్కి త‌గ్గిన‌ట్లు సమాచారం.అనంత జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఉన్న యామిని బాల‌పై ప్రజల్లో వ్యతిరేకత దృష్ట్యా.

మాజీ మంత్రి శైలజా నాథ్‌ను చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.ఆయనకు సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే సీటు కేటాయించే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం..

ప్రకాశం జిల్లా లో క‌నిగిరి ఎమ్మెల్యే క‌దిరి బాబూరావుప‌ట్ల ప్రజ‌ల్లో తీవ్ర అసంతృప్తి ఉన్న నేరథ్యంలో… ఉగ్రన‌ర‌సింహారెడ్డిని చేర్చుకునేందుకు సిద్దమౌవుతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు పార్టీనుంచి వెళ్లిన దాడి వీర‌భ‌ద్రరావు లాంటి నేత‌ల‌ను కూడా తిరిగి చేర్చుకునేందుకు టీడీపీ సిద్దంగా ఉంది.