ఆపరేషన్ ఆకర్ష్ ... వికర్షించిందా ..? ఆ ఎమ్యెల్యేల చేరికలు ఎక్కడ ..?     2019-01-17   14:37:13  IST  Sai Mallula

తెలంగాణలో తమకు ఎదురైన లేదన్నట్టుగా మెజారిటీ స్థాయిలో సీట్లను గెలుచుకుంది టిఆర్ఎస్ పార్టీ. దీంతో మరో ఐదేళ్లు కూడా తమకు బలమైన ప్రతిపక్షం లేకుండా చూసుకోవాలని చూస్తోంది.ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రత్యర్థి పార్టీలకు చెందిన బలమైన నాయకులను ఎక్కించే పనికి శ్రీకారం చుట్టారు. టిడిపి కాంగ్రెస్ పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున టిఆర్ఎస్ లో చేరబోతున్నారు అంటూ… రకరకాల కథనాలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మంది లో 12 మంది… టిడిపి నుంచి గెలిచిన ఇద్దరు కారెక్కబోతున్నారు అంటూ ఆయా పార్టీలను కంగారు పెట్టారు. దీనికి తగ్గట్టుగానే టిఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో హడావిడి చేసింది. అయితే రోజులు గడిచిపోయాయి కానీ పార్టీలో చేరతారు అని చెప్పిన నాయకులు ఎవరూ… గులాబీ పార్టీలో చేరలేదు.

Operation Akarsh Failed In Telangana TRS-Operation Sabhitha Indra Reddy Son Sabitha TCongress Telagnana Politics TRS

Operation Akarsh Failed In Telangana TRS

కొంతమంది అసలు టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్ళమని తెగేసి చెప్పారు. అయితే కొంతమందికి పార్టీ మారితే… మంత్రి పదవులతో పాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇస్తామని టిఆర్ఎస్ నుంచి హామీలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో కానీ చేరికలు మాత్రం జరగలేదు. నిజానికి అది మైండ్ గేమ్ అని.. ఇప్పుడిప్పుడే తేలిపోతోంది. టీఆర్ఎస్ అనుకూల మీడియా సాయంతో.. ఎవరెవర్ని పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్నారో ప్రత్యేకంగా టార్గెట్ చేసి మరీ. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ కోవలోనే మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి.. ఆయన కుమారుడికి ఎంపీ టిక్కెట్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే. వారిపై నుంచి ఖండనలు వచ్చాయి తప్ప.. ఆ మైండ్ గేమ్ ఫలించలేదు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే.. కాంగ్రెస్ కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే.. వారికి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయవచ్చన్న కేసీఆర్ ప్లాన్ అక్కడితో బెడిసికొట్టింది.

Operation Akarsh Failed In Telangana TRS-Operation Sabhitha Indra Reddy Son Sabitha TCongress Telagnana Politics TRS

ఎన్ని మైండ్ గేమ్స్ ఆడినా… ఈ సారి టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ గొప్పగా ఫలించలేదని తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేల చేరిక విషయంలో కూడా. టీఆర్ఎస్ వైపు నుంచి పెద్దగా ముందడుగు పడిన పరిస్థితులు కనిపించడం లేదు. సండ్ర టీఆర్ఎస్ లో చేరితే మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. అయితే దాదాపు ఈయన కారెక్కడం ఖాయం అనుకున్న సమయంలో ఏమైందో ఏమో కానీ ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. ఇక మరో టీడీపీ ఎమ్యెల్యే మచ్చ నాగేశ్వరరావు అయితే పార్టీ మారేది లేదు అంటూ.. ఏకంగా అమరావతి వెళ్లి చంద్రబాబు కి క్లారిటీ ఇచ్చేసాడు. ఇక పక్క పార్టీల నుంచి ఎమ్యెల్యేలు టీఆర్ఎస్ లో చేరే అవకాశం కనిపించకపోవడంతో ఆపరేషన్ ఆకర్ష్ వికర్షించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.