నిర్మాతలుగా మారిన నయన్, విగ్నేష్.. ఏ సినిమాకంటే?

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార ఆమె ప్రియుడు విగ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి నిర్మాణ సంస్థలో ఇప్పటికే కూళాంగళ్, రాఖీ చిత్రాలు తెరకెక్కాయి.

 Oor Kuruvi New Movie Directed Nayanthara And Vignesh Shivan-TeluguStop.com

త్వరలోనే ఈ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో మరోసారి వీరి నిర్మాణ సంస్థలో మరొక సినిమాను నిర్మించడానికి సిద్ధమయ్యారు.

బిగ్‌బాస్‌ ఫేమ్‌ కవిన్‌ కథానాయకుడిగా అరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఊర్‌ కురువి అనే చిత్రానికి నయనతార విగ్నేష్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

 Oor Kuruvi New Movie Directed Nayanthara And Vignesh Shivan-నిర్మాతలుగా మారిన నయన్, విగ్నేష్.. ఏ సినిమాకంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కవిన్ ఇప్పటికే నటించిన లిప్టు చిత్రం ఇటీవల ఓటీటీ విడుదలై మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈ క్రమంలోనే రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థలో మరొక సినిమా తెరకెక్కించనున్నారు.

Telugu Arun, Kollywood, Nayanatara, New Director, Oor Kuruvi, Vignesh Shivan-Movie

ఇక అరుణ్ ఈ సినిమాకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.అరుణ్ ఇదివరకే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం వల్ల అతడి ప్రతిభను గుర్తించిన విగ్నేష్ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు.ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

#Vignesh Shivan #Nayanatara #Oor Kuruvi #Arun #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube