అయ్యోయో.. 2 గంటలు ఆన్లైన్ క్లాస్ తీసుకున్న ప్రొఫెసర్.. కానీ..?!

కరోనా వైరస్ కారణంగా దాదాపు చాలా మంది విద్యార్థులకు ఆన్లైన్ ద్వారానే క్లాసులు నిర్వహిస్తున్నారు.స్కైప్, జూమ్, గూగుల్ లాంటి వి ఉపయోగిస్తూ టీచర్లు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు.

 Oops The Professor Who Took The Online Class For 2 Hours But, Onilne Classes, Mu-TeluguStop.com

ఇది చెప్పడానికి చాలా బాగానే ఉంది.కానీ, ఆన్లైన్ తరగతులు వల్ల అనేకమంది విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.

కొంతమందికి నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే, మరికొందరికి ఇంట్లో కరెంటు లేకుండా పోవడం లేదా ఫోన్ అందుబాటులో లేకపోవడం ఇలా వివిధ రకాల ఇబ్బందులతో బాధపడుతున్నారు.

ఇలా ఉండగా తాజాగా ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.సింగపూర్ లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కు చెందిన ఒక మ్యాథ్స్ ప్రొఫెసర్ విద్యార్థుల కోసం రెండు గంటల పాటు ఆన్లైన్ లో క్లాస్ నిర్వహించాడు.

కానీ, ఆ ప్రొఫెసర్ ఆన్లైన్ క్లాస్ లో భాగంగా మ్యూట్ చేయడంతో విద్యార్థులకు ఆయన తెలిపిన పాఠాలు అసలు ఏమీ కూడా వినపడలేదు.కొంత సమయం పాటు కొంత విద్యార్థులు ఏదైనా సాంకేతిక సమస్య ఉంది అని అనుకొని అలాగే వేచి ఉన్నారు.

కానీ.ఎంతకి ఆ ప్రొఫెసర్ చెప్పేది ఏమీ వినిపించకపోవడంతో క్లాస్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు.ఇది ఇలా ఉండగా ఆ ప్రొఫెసర్ మ్యూట్ పెట్టడడంతో విద్యార్థులకు ఏం జరిగిందో అర్థం కాక.రెండు గంటల పాటు వేచి ఉన్న విద్యార్థులు వారి ప్రొఫెసర్ ఏం చెబుతున్నాడో అర్థం కాక కొంత మంది విద్యార్థులు కాల్స్, మెసేజ్ చేస్తూ ఎంతగానో విషయాన్ని తెలియజేసేందుకు ప్రయత్నించారు.కానీ, ఆ ప్రొఫెసర్ స్పందించలేదు.చివరికి తన వద్దే సమస్య ఉందని తెలుసుకున్న ఆ ప్రొఫెసర్ తీవ్రమైన అసహనానికి గురి అయ్యి, తానే తప్పు చేశాను అని తెలుసుకొని కూల్ అయ్యి  విద్యార్థులకు మళ్లీ ఎప్పుడైనా క్లాస్ తీసుకుంటా అని తెలియజేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube