అయాయ్యో.. అప్పగింతల లో భాగంగా అతిగా ఏడ్చిన నవ వధువు.. చివరికి..?!

సాధారణంగా పెళ్లి తంతు అంటేనే ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో  ముఖ్య ఘట్టాలు ఉంటూనే ఉంటాయి.ముఖ్యంగా జీలకర్ర, బెల్లం, తాళికట్టు సమయం, అప్పగింతలు ఇలా ఉంటాయి.

 Oops The Newlyweds Who Cried So Much As Part Of The Ssignments Finally  Marraige-TeluguStop.com

ఇందులో తాళికట్టు సమయం ఎంత ముఖయమో అప్పగింతలు కూడా ఒక ముఖ్యమైన విషయం.పెళ్లి చేసుకున్న తర్వాత వరుడు కుటుంబానికి వధువు తల్లిదండ్రులు అప్పగించే తంతే ఇది.ఈ సందర్భంలో వధువు కుటుంబ సభ్యులు అందరు  కన్నీరుమున్నీరుగా విలవించడం ఉండడం మనం చూస్తూనే ఉంటాం.  తమ కుమార్తెకు ఎలాంటి కష్టం రానీయకుండా చూసుకోవాలని, ఏదైనా తప్పులు జరిగితే కాస్త సర్దుకుపోవాలి అంటూ తల్లిదండ్రులు వధువును, వరుడు కుటుంబానికి అప్పగిస్తూ ఉంటారు.

ఇలా ఒక సంఘటనలో అత్తారింటికి వెళ్లే సందర్భంలో అతిగా ఏడుస్తూ ఉన్న వధువు మృతి చెందిన సంఘటన తాజాగా ఒడిస్సా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే ఒడిస్సా రాష్ట్రంలోని సోనేపూర్ జిల్లాలో గుప్తేశ్వరి సాహూకు చెందిన ఒక యువకుడికి ఇటీవల వివాహం జరిగింది.

మరుసటి రోజు వధువును అత్తారింటికి పంపేందుకు అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసి, నవ వధువుకు కుటుంబ సభ్యులు వీడ్కోలు పలుకుతున్న సమయంలో ఒక్కసారిగా ఆమె స్పృహ కోల్పోయి కిందపడిపోయింది.దీంతో వెంటనే వధువు కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

తీరా పరీక్షలు నిర్వహించగా ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారణ చేశారు.అప్పగింతల సమయంలో అతిగా ఏడవడం వల్లనే ఆమెకు గుండెపోటు వచ్చిందని దీంతో వధువు చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు.

ఈ క్రమంలో వధువు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నీరసం వల్లే సృహ కోల్పోయిందని అనుకున్నామే తప్ప ఇలాంటి ఘోరం చోటు చేసుకుంటుందని అనుకోలేదు అని కన్నీరు మున్నీరయ్యారు.ఈ సంఘటనతో అప్పటి వరకు కలకలలాడే పెళ్లి ఇల్లు  కాస్త విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube