అయ్యోయో: బంతి అనుకోని బాంబుతో ఆడుకున్న చిన్నారులు.. చివరకి..?!

కేరళ లో తాజాగా ఓ నాటు బాంబు పేలి ఇద్దరు చిన్నారులు గాయాలపాలయ్యారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

 Oops The Kids Who Played With The Ball Unexpectedly Bomb Finally-TeluguStop.com

కేరళ రాష్ట్రంలోని కన్నూర్​ జిల్లా ఇర్రిట్టి పడికచల్ ​లో ఈ సంఘటన చోటు చేసుకుంది.మహమ్మద్ అమిన్ ( 4 సంవత్సరాలు) , మహమ్మద్ రదేహ్ (1.5 సంవత్సరాలు) అనే ఇద్దరు సోదరులు వారి ఇంటి ముందు కనిపించిన ఓ చిన్న బాలు ఆకారంలో ఉన్న ఐస్ క్రీమ్ కప్పును ఇంట్లోకి తీసుకు వెళ్లారు.అయితే దురదృష్టవశాత్తు ఆ కప్పులో బాబు ఉందని ఆ పిల్లలకు తెలియదు.

దాన్ని ఇంట్లోకి తీసుకు వెళ్లిన చిన్నారులు దాంతో ఆడుకుంటూ ఆ కప్పును తెరవడానికి ప్రయత్నించారు.దీంతో వెంటనే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.దీంతో ఆ ఇరువురు సోదరులు తీవ్రంగా గాయాలపాలయ్యారు.ఆ బాంబు పేలుడు శబ్దానికి ఇంట్లోనే కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయి.

 Oops The Kids Who Played With The Ball Unexpectedly Bomb Finally-అయ్యోయో: బంతి అనుకోని బాంబుతో ఆడుకున్న చిన్నారులు.. చివరకి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సంఘటనకు సంబంధించి ఆ ప్రాంతంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.బాంబు పేలడంతో తీవ్ర గాయాలైన క్షతగాత్రులను పరియరామ్ వైద్య కళాశాల ఆసుపత్రికి వెంటనే పోలీసులు తరలించారు.

ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.తాజాగా వెలువడిన అసెంబ్లీ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు రోజుల్లోనే ఇలాంటి సంఘటన జరగడం పై ప్రస్తుతం ఈ అంశం కేరళ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

#Chidren #Bomb #Elections #Police #Kerala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు