అరెరే.. ఇలాంటి నీలిరంగు అరటి పళ్ళను చూసారా ఎప్పుడైనా..?!

అందరూ ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల పండ్లను తినమని డాక్టర్లు పదే పదే చెబుతూ ఉంటారు.పండ్లలో ముఖ్యంగా అరటి అనేది ప్రజల ఇళ్లలో సర్వసాధారణంగా కనిపించే పండు.

 Oops Have You Ever Seen Such Blue Banana Teeth-TeluguStop.com

రాత్రి పడుకునే ముందు ఒక అరటిపండు తింటే చాలు. ఎక్కువ బలం వస్తుందని పెద్దలు చెబుతుంటారు.

అంతేకాదు అరటిపండు ఎక్కువ ఎనర్జీని కూడా ఇస్తుంది.ఈ పండు అన్ని సీజన్లలో మార్కెట్లో లభిస్తుంది.

 Oops Have You Ever Seen Such Blue Banana Teeth-అరెరే.. ఇలాంటి నీలిరంగు అరటి పళ్ళను చూసారా ఎప్పుడైనా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అరటిలో నీలి అరటిపండ్లు కూడా ఉంటాయి.అంతేకాదు వీటి రుచి కూడా చాలా భిన్నంగా ఉంటుంది.

ఈ వెరైటీ అరటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తీసుకుందాం.ఈ అరటిని ఆగ్నేసియాలో సాగు చేస్తారు.

హవాయి దీవులలో కూడా ఈ రకం అరటి తోటలు ఉన్నాయి.నీలం రంగు అరటిని దక్షిణ అమెరికాలో కూడా పండిస్తారు.

ఎందుకంటే చల్లటి ప్రాంతాలలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలలో దీని దిగుబడి బాగుంటుంది.,/br>

అరటిని టెక్సాస్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, లూసియానా లో ఎక్కువగా పండిస్తారు.

ఈ అరటి రుచి వెనిలా ఐస్ క్రీమ్ లాగా ఉంటుందట.ఈ అరటిని బ్లూ జావా అరటి అనికూడా అంటారు.

నీలం రంగు అరటిని కెర్రీ, హవాయి అరటి, ఐస్ క్రీమ్ అరటి అని కూడా అంటారు.ఈ అరటికాయ 7 అంగుళాల పొడవు ఉంటుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.

ఈ అరటి చెట్టు ఎత్తు ఆరు మీటర్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.సాగు చేసిన 15 నుంచి 24 నెలల తరువాత పంట రావడం ప్రారంభమవుతుంది.

ఈ నీలం అరటిపండు తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తుంటారు.ఈ అరటి మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది.జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

#Farming #Viral #Health Benefits #Health Care #Blue Banana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు