అయ్య‌య్యో.. బండి తొంద‌ర‌పాటు.. కేంద్రం కౌంట‌ర్‌!

బండి సంజ‌య్‌కు రాజ‌కీయాల్లో మంచి మాస్ లీడ‌ర్‌గా పేరుంది.ఆయ‌న చాలా ఆవేశంగా మాట్లాడుతుంటే కార్య‌క‌ర్త‌లు కూడా వావ్ అంటూ చ‌ప్ప‌ట్లు కొడుతారు.

 Oops Bandi Sanjay Rush Center Counter-TeluguStop.com

అయితే ఆయ‌న అప్పుడ‌ప్పుడు ఆవేశంగా మాట్లాడుతూ టంగ్ కూడా స్లిప్ అవుతుంటారు.అది కూడా అప్పుడ‌ప్పుడు చ‌ట్ట స‌భ‌ల్లోనూ ఇలా జ‌రిగిది.

అయితే ఇప్పుడు ఆయ‌న మ‌రోసారి పార్ల‌మెంట్ సాక్షిగా త‌డ‌బ‌డ్డారు.అయితే ఈ సారి దీనికి కేంద్రం కూడా కౌంట‌ర్ వేయ‌డం గ‌మ‌నార్హం.

 Oops Bandi Sanjay Rush Center Counter-అయ్య‌య్యో.. బండి తొంద‌ర‌పాటు.. కేంద్రం కౌంట‌ర్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు భార‌త పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

కాగా పార్లమెంట్ స‌మావేశాల్లో మాట్లాడేట‌ప్పుడు పూర్తి అవగాహన చాలా అవసరం.

కానీ బండి సంజ‌య్ మాత్రం ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి మ‌రీ రెచ్చిపోయి ప్ర‌శ్నించారు.తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన 14, 15 ఫైనాన్స్ కమిషన్ నిధుల విష‌యంలో మాట్లాడుతూ దీనిపై కేంద్రం జోక్యాన్ని ప్రశ్నిస్తూ కొన్ని క్వ‌శ్చ‌న్లు వేయ‌డంతో అంతా అవాక్క‌య్యారు.

ఎందుకంటే ఆయ‌న అడిగిన ప్ర‌శ్నే క‌రెక్టు కాదు.ఇక దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అయిన పంకజ్ చౌదరి ఏకంగా కౌంట‌ర్ వేస్తూ బండికి స‌మాధానం ఇచ్చారు.

Telugu Bandi Sanjay, Bjp, Central Govt, Central Minster, Pankaj Chowdary, Parlment, Ts Poltics-Telugu Political News

క‌నీసం సొంత పార్టీ నేత అని కూడా చూడ‌కుండా ఆయ‌న‌కు కౌంట‌ర్ వేసేశారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 రూల్ ప్ర‌కారం అస‌లు ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు అయినా స‌రే అధికారికంగా వచ్చే నిధులపై కేంద్ర ప్ర‌భుత్వానికి ఎలాంటి అధికారం ఉండదని,రాష్ట్రాల‌కే పూర్తి ప‌వ‌ర్ ఉంటుంద‌ని చెప్ప‌డంతో బండికి షాక్ ఇచ్చిన‌ట్టు అయింది.ఒక పార్టీకి రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న బండి సంజ‌య్‌కు ఈ మాత్రం కూడా విష‌యం తెలియ‌దా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేసేదాకా వెల్లింది విష‌యం.దీంతో ఇత‌ర పార్టీల కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌పై ట్రోలింగ్ మొద‌లు పెట్టేశారు.

ఇక దీన్ని చూసిన వారంతా అయ్యో అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

#Pankaj Chowdary #Central Govt #Parlment #Bandi Sanjay #Central Minster

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు