డాక్టర్ చేసిన తప్పుకి సంబంధం లేని 15 మంది బంధువులు అయ్యారు  

గర్భధారణ కోసం వచ్చిన వారికి తన వీర్యం ఎక్కించిన డాక్టర్. .

Ontario Fertility Doctor Used His Own To Inseminate Patients-

ఒక డాక్టర్ చేసిన తప్పు సంబంధం లేని 15 మందిని ఏకంగా రక్తసంబంధంతో ముడిపెట్టింది.అయితే ఈ సంబంధాలు బయటపడిన తర్వాత వారి సొంత తండ్రి అనుకున్నవాళ్ళు ఇప్పుడు ఆవేదన చెందుతూ ఉంటే ఆ పిల్లలు చలించిపోతున్నారు.తమకి తెలియకుండా ఓ డాక్టర్ చేసిన నిర్వాకం వలన ఇదంతా జరిగింది అని వారంతా కలిసి ఇప్పుడు సదరు డాక్టర్ మీద ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన గురించి ప్రపంచానికి తెలిసింది.వివరాలలోకి వెళ్తే సంతానోత్పత్తి కేంద్రంలో ఒకరి వీర్యం బదులుగా మరొకరి వీర్యాన్ని అనేక దశాబ్దాల పాటు మహిళలకు ఎక్కిస్తూ వస్తున్న ఫెర్టిలిటీ డాక్టర్ లైసెన్స్‌ ఆంటారియో డిసిప్లినరీ రద్దు చేసింది...

Ontario Fertility Doctor Used His Own To Inseminate Patients--Ontario Fertility Doctor Used His Own To Inseminate Patients-

బెర్నార్డ్ నార్మన్ బార్విన్ అనే డాక్టర్ వద్దకి గర్భధారణ సమస్యలతో వచ్చిన మహిళలకి వారు చెప్పిన వీర్యం ఎక్కించకుండా ఏకంగా తన వీర్యాన్నే ఎక్కించాడు.కొంత మంది సంబంధం లేకుండా వేరొకరి వీర్యం ఎక్కించాడు.అయితే ఈ విషయం 25 ఏళ్ల తరువాత బెర్నార్డ్ వీర్యం ద్వారా పుట్టిన యువతి తన బయోలాజికర్ తండ్రి బెర్నార్డ్ అని తెలుసుకోవడంతో బయటపడింది.బెర్నార్డ్ దాదాపు నలభై ఏళ్లగా కొన్ని వందల మందికి వేరొకరి వీర్యాన్ని ఎక్కిస్తూ వచ్చినట్టు సర్జన్లు, ఫిజీషియన్లు విచారణలో తెలిసింది.

దాదాపు 100 మంది ఇప్పుడు అతని మీద ఫిర్యాదు చేయగా, అందులో బెర్నార్డ్ వీర్యం ద్వారా పుట్టిన 11 మంది వరకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది.బెర్నార్డ్ తన అసలు తండ్రి అని తెలిసినప్పటి నుంచి తన జీవితం మారిపోయిందని, ఇప్పటివరకు తన తండ్రిగా ఉన్న వ్యక్తి ఈ వార్త విని ఆవేదనతో క్రుంగిపోతున్నారు అని రెబెక్కా డిక్సన్ అనే యువతి తన ఆవేదన వ్యక్తం చేసింది.ఆ డాక్టర్ చేసిన పని వలన ఇప్పుడు తమ కుటుంబం మొత్తం మానసిక వేదన అనుభవిస్తున్నామని తెలియజేసింది.

Ontario Fertility Doctor Used His Own To Inseminate Patients--Ontario Fertility Doctor Used His Own To Inseminate Patients-