కొత్త రూల్.. ఆల్కహాల్ కావాలా.. అయితే వ్యాక్సిన్ వేయించుకోండి..!

కరోనా. ఈ పేరు గత కొద్దీ కాలంగా ప్రపంచంలోని ప్రజలందరినీ భయపెడుతుంది.ఈ పేరు వింటేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.కరోనా తర్వాత అందరి లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది.కరోనా ముందు కరోనా తర్వాత అనే పరిస్థితికి వచ్చింది.కరోనా కారణంగా ఎంతో మంది తిండి లేక ఉపాధి సైతం కోల్పోయి జీవత్సవంగా బతుకు తున్నారు.

 Only Vaccinated People Can Buy Alcohol In Tamil Nadu State Amid Covid Pandemic,-TeluguStop.com

ఇప్పటికి నిరుద్యోగులకు ఉపాధి దొరకడం లేదు.

కరోనా కారణంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక వారిని ఉద్యోగాల నుండి తప్పించడం వల్ల నిరుద్యోగుల శాతం ఇంకా పెరిగింది.

అయితే కొద్దీ రోజుల క్రితమే కరోనా కు వ్యాక్సిన్ రావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.అయితే వ్యాక్సిన్ వేయించు కోవడానికి చాలా మంది ప్రజలు ఇప్పటికి భయ పడుతున్నారు.

వారిలో ఇంకా అపోహలు తొలగి పోవడం లేదు.వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రాణాలకు ప్రమాదమేమో అని ఇంకా జంకుతున్నారు.

సెలెబ్రిటీలు సైతం వ్యాక్సిన్ వేయించుకుని ప్రజలందరినీ వేయించుకోవాలని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.ఎంత ప్రచారం చేస్తున్న ఇంకా వ్యాక్సిన్ వేయించుకోవడానికి జనం ఇష్టపడడం లేదు.ఈ క్రమంలో వ్యాక్సిన్ స్పీడ్ పెంచాలని తమిళనాడులో కొత్త రూల్ పెట్టారు.ఈ రూల్ వల్ల ప్రజల్లో కొంత అయినా మార్పు వచ్చి వ్యాక్సినేషన్ వేయించు కుంటారని అలా పెట్టారట.

Telugu Alchohol, Alcohol, Nilagiri, Tamil Nadu, Tamilnadu, Doses Vaccine-Latest

ఇంతకీ ఏంటా రూల్ అని అనుకుంటున్నారా.తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో ఆ జిల్లా కలెక్టర్ ఈ కొత్త రూల్ పెట్టారు.అక్కడి ప్రజలు రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకుంటేనే ఆల్కహాల్ అమ్మాలని ఆయన ఆదేశించారు.అందుకే అందరు వ్యాక్సిన్ వేయిచుకోవాలని లేకపోతే మద్యం అమ్మం అని చెప్పారు.దీంతో కొంతమంది వ్యాక్సిన్ వేయించుకుంటే.మరి కొంతమంది మాత్రం ఆల్కహాల్ వద్దు.

వ్యాక్సిన్ వేయించుకోము.అని అంటున్నారు.

Telugu Alchohol, Alcohol, Nilagiri, Tamil Nadu, Tamilnadu, Doses Vaccine-Latest

అక్కడ పెరుగుతున్న కేసుల దృష్ట్యా వ్యాక్సిన్ వేయించుకుంటేనే మద్యం అమ్ముతామనే రూల్ పెట్టమని వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉంటేనే ఆల్కహాల్ అమ్మాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు.ఇదండీ మ్యాటర్.ఆల్కహాల్ కావాలంటే వ్యాక్సిన్ వేయించు కోవాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube