ఆ రైలులో అంద‌రికీ ఉచిత ప్ర‌యాణమే.. ఎక్క‌డ ఎక్కాలంటే..

భారతీయ రైల్వే.ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్.

 Only Train In The Country In Which You Can Travel For Free Journey Passengers Dam , Train , Journey , Free , Himachalpradesh ,bhakra Beas-TeluguStop.com

ఇంత‌టి భారీ వ్య‌వ‌స్థ క‌లిగిన రైల్వేశాఖ దేశంలో ఒక ఉచిత రైలును న‌డిపిస్తోంది.ఈ ప్రత్యేక రైలు హిమాచల్ ప్రదేశ్- పంజాబ్ సరిహద్దులో నడుస్తుంది.

మీరు భాక్రా నాగల్ డ్యామ్ చూడటానికి వెళితే, ఈ రైలు ప్రయాణాన్ని ఉచితంగా ఆస్వాదించవచ్చు.ఈ రైలు నాగల్ నుండి భాక్రా డ్యామ్ వరకు నడుస్తుంది.

 Only Train In The Country In Which You Can Travel For Free Journey Passengers Dam , Train , Journey , Free , Himachalpradesh ,Bhakra Beas-ఆ రైలులో అంద‌రికీ ఉచిత ప్ర‌యాణమే.. ఎక్క‌డ ఎక్కాలంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గత 73 ఏళ్లుగా 25 గ్రామాల ప్రజలు ఈ రైలులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.భాగ్రా డ్యామ్ గురించి అంద‌రికీ తెలియ‌జేయ‌డానికే ఈ ఉచిత రైలును న‌డుపుతున్నారు.

భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ ఈ రైలును నిర్వహిస్తుంది.ఈ రైలు డీజిల్ ఇంజిన్‌తో నడుస్తుంది.

ఈ రైలు నంగల్ నుండి ఉదయం 7:05 గంటలకు బ‌య‌లుదేరుతుంది.సుమారు 8:20 గంటలకు ఈ రైలు భక్రా నుండి నంగల్‌కు తిరిగి వస్తుంది.నంగల్ నుండి భాక్రా డ్యామ్ చేరుకోవడానికి రైలు దాదాపు 40 నిమిషాలు పడుతుంది.రైలును ప్రారంభించినప్పుడు అందులో 10 కోచ్‌లు నడిచేవి, ప్రస్తుతం 3 కోచ్‌లు మాత్రమే ఉన్నాయి.

రైలులో ఒక కోచ్‌ను పర్యాటకులకు, మరొకటి మహిళలకు కేటాయించారు.ఈ రైలులోని అన్ని కోచ్‌లు చెక్కతో తయారు చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube