కత్రినా పెళ్లి కార్డు అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరో.. ఎవరంటే?

Only Tollywood Hero To Get Invitation To Katrina Kaifs Wedding

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లలో కత్రినా కైఫ్ ఒకరు.ఈ ముద్దు గుమ్మ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుంది.

 Only Tollywood Hero To Get Invitation To Katrina Kaifs Wedding-TeluguStop.com

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లాడ బోతుంది.ఈ స్టార్ కపుల్ పెళ్లి గురించే బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

లవ్ బర్డ్స్ గా విహరించి ఇప్పుడు వివాహం ద్వారా ఒక్కటి కాబోతున్నారు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్.వీరిద్దరూ డిసెంబర్ లో వివాహం చేసుకుంటున్నట్టు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది.

 Only Tollywood Hero To Get Invitation To Katrina Kaifs Wedding-కత్రినా పెళ్లి కార్డు అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరో.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరి పెళ్లి అని బయటకు ఎన్ని వార్తలు వచ్చిన వీరిద్దరూ మాత్రం అస్సలు ఈ విషయంపై ఇంత వరకు స్పందించలేదు.కానీ కత్రినా, విక్కీ కౌశల్ ఈ నెల 12న వివాహం చేసుకుంటున్నారని తెలుస్తుంది.

రాజస్థాన్ లోని సవాయ్ మధోపూర్ జిల్లా లోని 1వ శతాబ్దపు ప్యాలెస్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా లో ఈ వివాహ వేడుక చేసుకుంటున్నారనే విషయం సన్నిహితుల ద్వారా బయటకు వచ్చింది.

Telugu Katrinavicky, Katrina, Tollywood, Venkatesh, Vikky Koushal-Movie

వీరి పెళ్లి అతి కొద్ది మంది బంధుమిత్రుల మధ్యనే జరగబోతున్నట్టు టాక్.ఇక ఇప్పటికే ఈ జంట పెళ్లి పత్రికలను కూడా పంచుతున్నారని సమాచారం.చాలా ముఖ్యమైన గెస్టులను మాత్రమే వీరు పెళ్ళికి ఆహ్వానించనున్నారట.

అయితే కత్రినా కైఫ్ పిలిచే అతి కొద్ది మందిలో విక్టరీ వెంకటేష్ ఒకరు.ఈయనకు ఇప్పటికే పెళ్ళికి ఆహ్వానం కూడా అందినట్టు సమాచారం.

కత్రినా, వెంకటేష్ కలిసి మల్లీశ్వరి సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా చేసినప్పటి నుండి కత్రినా కు వెంకీ కి మంచి స్నేహం ఉందట.అందుకే కత్రినా పిలిచే అతి కొద్ది మంది లిస్టులో వెంకీమామ కూడా ఉన్నారని తెలుస్తుంది.మరి ఆహ్వానం అందిన విషయం నిజమైతే టాలీవుడ్ లో కత్రినా పెళ్లికి ఆహ్వానం అందుకున్న ఏకైక హీరో వెంకటేష్ అవుతారు.

మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే పెళ్లి రోజు వరకు వేచి ఉండాల్సిందే.

#Venkatesh #Katrina #Vikky Koushal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube