కరోనాతో చివరికి అందరికీ ఓటీటీ గతి అయ్యేలా ఉంది

సినిమాకి ఎన్నడూ లేనంత కష్టకాలం వచ్చింది.ఈ కరోనా కారణంగా సినిమాల ద్వారా జరిగే కోట్ల రూపాయిల వ్యాపారం ఆగిపోయింది.

 Only Ott Platforms Choice To Release Movies, Tollywood, Telugu Cinema, South Cin-TeluguStop.com

నిర్మాతలు వందల కోట్ల రూపాయిలు మేర నష్టపోయారు.కొన్ని సినిమాలు షూటింగ్ లు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యి ఉంటే కొన్ని సినిమాలు మాత్రం ఇంకా నిర్మాణ దశలో ఉండిపోయాయి.

దీంతో అటు షూటింగ్ కి వెళ్ళలేక, మరల వదులుకోలేక చాలా మంది నిర్మాతలు అవస్థలు పడుతున్నారు.ఇదిలా ఉంటే ఇలాంటి సమయంలో కరోనా కష్టకాలం నుంచి నిర్మాతలని బయట పడేయడానికి ఒటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.

చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అన్నింటికీ డిమాండ్ బట్టి పెద్ద మొత్తంలో రైట్స్ క్రింద నిర్మాతలకి ఇవ్వడానికి ముందుకి వస్తున్నాయి.ఇదే ఇదే అవకాశంగా భావిస్తున్న చిన్న సినిమాల వాళ్ళు ఇప్పటికే ఓటీటీ బాట పట్టారు.

ఈ నేపథ్యంలో చాలా సినిమాలు ఓటీటీలో ఇప్పటికే రిలీజ్ అయ్యాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడున్న పరిస్థితిలో పెద్ద సినిమాల వారికి కూడా ఓటీటీ తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.

ఇప్పటికే కొన్ని పెద్ద సినిమాలు షూటింగ్ లు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యి ఉన్నాయి.అయితే ఈ సినిమాలని ముందు నుంచి థియేటర్ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు, దర్శకులు భావిస్తున్నా కూడా ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.

రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి తప్ప తగ్గడం లేదు.ఈ నేపథ్యంలో పెద్ద సినిమా నిర్మాతలు కూడా ఓటీటీ సంస్థలలో మంచి రేటు ఇవరైతే ఇస్తారో వారికి డిజిటల్ రిలీజ్ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.

డిజిటల్ లో రిలీజ్ చేయడం ద్వారా ప్రమోషన్ ఖర్చు కూడా తగ్గిపోతుందని వారు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలలో ఓటీటీలోకి రిలీజ్ కావడానికి రవితేజ క్రాక్ సినిమా ముందు వరుసలో ఉంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube