అఖండ నుండి ఒకటే.. అయినా చాలంటున్న ఫ్యాన్స్!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో, ఈ కాంబో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ధీమాగా ఉన్నారు.

 Only One Treat From Akhanda Movie-TeluguStop.com

ఇక ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌లకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమా నుండి మరో అప్‌డేట్ బాలయ్య పుట్టినరోజు కానుకగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసింది.

అయితే బాలయ్య పుట్టినరోజున అఖండ చిత్రంలోని మరో టీజర్‌ను రిలీజ్ చేస్తారని కొందరు, ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తారని మరికొందరు అనుకున్నారు.దీంతో బాలయ్య బర్త్‌డే కానుక ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

 Only One Treat From Akhanda Movie-అఖండ నుండి ఒకటే.. అయినా చాలంటున్న ఫ్యాన్స్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ రోజు కేవలం అఖండ చిత్రానికి సంబంధించి మరో పోస్టర్ మాత్రమే రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్‌లు వాయిదా పడటంతో, ఈ సినిమాకు సంబంధించి మరో టీజర్‌ను కట్ చేయడం కుదర్లేదని చిత్ర యూనిట్ అంటోంది.

అందుకే బాలయ్య బర్త్‌డే రోజున కేవలం ఒకటే పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు బోయపాటి అండ్ టీమ్ రెడీ అయ్యిందట.అయితే బాలయ్య కొత్త సినిమా నుండి ఒకటే పోస్టర్ వచ్చినా తమకు సంతోషమే అంటున్నారు ఆయన అభిమానులు.

అఖండ చిత్రంలో బాలయ్య పవర్‌ఫుల్ పాత్రకు సంబంధించి ఈసారి ఎలాంటి పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుందా అని వారు ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

#Boyapati Sreenu #Akhanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు