చుక్కలు చూపుతున్న బీర్లు... మనిషికి ఒక్కటే అనడంతో ఆందోళనలో హైదరాబాదీ తాగుబోతు రాయుళ్లు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండి పోతున్నాయి.గతంతో పోల్చితే ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయి అంటూ వాతావరణ శాఖ వారు చెబుతున్నారు.

 Only One Beer For Head In Hyderabad-TeluguStop.com

ఒకటి రెండు రోజుల్లో హాఫ్‌ సెంచరీ కొట్టినా ఆశ్చర్య పోనక్కర్లేదు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలువురు పిట్టలు రాలిపోయినట్లుగానే ఈ ఎండకు రాలిపోతున్నారు.

ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో చల్లదనం కోసం ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఇంత వేడిలో తాగుబోతులు చేస్తున్న ఒకే ఒక పని చల్లని బీర్‌లు తీసుకు వచ్చి తాగి హాయిగా పడుకోవడం.

ఇప్పుడు వారికి ఇది కూడా కష్టం అయ్యింది.

హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో బీర్ల అమ్మకాలపై ఆంక్షలు పెట్టడం జరిగింది.

ఆ ఆంక్షలు వైన్స్‌ వారు తమకు తాముగా విధించుకున్నారు.బీర్ల అమ్మకాలు ఈ వేసవిలో గణనీయంగా పెరగడం జరిగింది.

అయితే డిమాండ్‌కు తగ్గట్లుగా బీర్ల ఉత్పత్తి జరడం లేదు.నీటి లేమిడి కారణంగా లేదా మరేంటో కాని బీర్ల ఉత్పత్తి సరిపడ లేదు.

దాంతో హైదరాబాద్‌లో చాలా ఏరియాల్లో రోజుకు 200 నుండి 250 కాటన్‌ల బీర్లు సరఫరా చేయాల్సింది కేవలం 100 కాటన్‌ల బీర్లు మాత్రమే సరఫరా చేయడం జరుగుతుంది.దాంతో వినియోగదారులకు అందరికి ఇవ్వలేక పోతున్నారు.

చుక్కలు చూపుతున్న బీర్లు మన�

వచ్చిన సరకు వచ్చినట్లుగా వెళ్లి పోతున్న నేపథ్యంలో సాయంత్రం సమయంలో వచ్చే వినియోగదారులు బీర్లు లేవు అంటూ సమాధానం చెప్పడంతో నానా రచ్చ చేస్తున్నారు.బీర్లు లేనప్పుడు బార్‌ ఎందుకు ఓపెన్‌ చేసి పెట్టుకున్నావంటూ ఇష్టం వచ్చినట్లుగా దాడులకు తెగ బడుతున్నారు.దాంతో పలు వైన్స్‌ వారు మనిషికి ఒక్క బీర్‌ అంటూ రేషన్‌ విధించడం జరిగింది.ఇలా చేసినా కూడా రాత్రి 7 లేదా 8 గంటల వరకు బీర్లు నిండుకుంటున్నాయట.

దాంతో నిర్ధిష్ట సమయంకు ముందే వైన్స్‌ను క్లోజ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి ఈ ఎండాకాలం తాగుబోతు రాయుళ్లకు పెద్ద కష్టమే వచ్చింది.

ఇదే పరిస్థితి జూన్‌ మూడవ వారం వరకు కొనసాగే అవకాశం ఉందని వైన్స్‌ నిర్వాహకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube