కేవలం రెండే రెండు ఆకులతో డయాబెటిస్ ని తరిమి కొట్టండి  

Only 2 Leaves Stop Diabetes-

మధుమేహం అనేది మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారం తీసుకోవటంలో సమయ పాలన లేకపోవటం వంటి కారణాలతో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు.మధుమేహం వచ్చిన వారిలో ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతాయి.

మధుమేహాన్ని కంట్రోల్ గా ఉంచాలంటే కొన్ని సహజసిద్ధమైన పద్ధతులు ఉన్నాయి.దాని కోసం మన పెరడులో ఉన్న కొన్ని రకాల ఆకులు సరిపోతాయి.

Only 2 Leaves Stop Diabetes- --

ఇప్పుడు ఆ ఆకుల గురించి వివరంగా తెలుసుకుందాం.

తమలపాకు
తమలపాకులో ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్.

సి.విటమిన్ లు సమృద్ధిగా వున్నాయి.రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ ని తగ్గించటంలో సహాయపడుతుంది.మధుమేహం ఉన్నవారు రోజుకొక ఆకు తింటే మంచిది.లేదా తమలపాకు ఉడకబెట్టి జ్యుస్ చేసుకొని అయినా త్రాగవచ్చు.ప్రతి రోజు ఇలా చేస్తూ ఉంటే మధుమేహం తగ్గిపోతుంది.

బిర్యానీ ఆకు
బిర్యానీ ఆకులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.

అలాగే బ్యాక్టీరియాను నాశనం చేసి రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి.ఈ ఆకు రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించటంలో బాగా సహాయపడుతుంది.

బిరియానీ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టాలి.ఈ నీటిని రోజులో బ్రేక్ ఫాస్ట్ కి ముందు,లంచ్ కి ముందు,డిన్నర్ కి ముందు ఇలా రోజులో మూడు సార్లు మూడు రోజులు త్రాగి, మరల రెండు వరాలు అయ్యాక మళ్ళీ రిపీట్ చేయాలి.

ఇలా ఫాలో అయితే మధుమేహము తగ్గిపోతుంది.

తులసి ఆకులు
తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో అధికంగా ఉంటుంది.

అదనంగా విటమిన్లు A, C మరియు K, అలాగే మాంగనీస్, రాగి, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం మరియు ఒమేగా -3 కొవ్వులు సహా అవసరమైన పోషకాలు అన్ని సమృద్ధిగా ఉన్నాయి.ఈ లక్షణాల కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను గణనీయంగా తగ్గించటంలో సహాయపడుతుంది.

తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి ప్రతి రోజు పరగడుపున త్రాగితే మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది.

మామిడి ఆకులు
మామిడి ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ లతో పాటు కాపర్, పొటాషియం, మెగ్నేషియం, ఫ్లెవోనాయిడ్స్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.

ఇవి రక్తంలో చక్కర స్థాయిలు పెరగకుండా సహాయపడతాయి.రాత్రి సమయంలో కొన్ని మామిడి ఆకులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి పరగడుపున త్రాగాలి.

ఇలా వారం రోజుల పాటు చేస్తే తేడాను మీరే గమనించి ఆశ్చర్యపోతారు.

వేప ఆకులు
వేప ఆకులలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంఫ్లమేతరీమరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు మరియు విటమిన్ E సమృద్ధిగా ఉంటాయి.

ఈ లక్షణాల కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి.ప్రతి రోజు రెండు వేపాకులను తినవచ్చు.లేదా జ్యుస్ గా తయారుచేసుకొని త్రాగవచ్చు.క్రమం తప్పకుండా ఒక వారం రోజుల పాటు త్రాగితే మంచి ఫలితం కనపడుతుంది.

కరివేపాకు ఆకులు
కరివేపాకులో కరివేపాకు లో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పిండి పదార్ధాలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి.ఈ లక్షణాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించటంలో సహాయపడతాయి.అందువల్ల ప్రతి రోజు ఆహారంలో కరివేపాకు ఉండేలా చూసుకోండి.

చూసారుగా ఫ్రెండ్స్ మన పెరటిలో ఉండే ఆకులతో మధుమేహాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో … మీరు ట్రై చేయండి.

తాజా వార్తలు

Only 2 Leaves Stop Diabetes- Related....