ఇదెక్కడి గోల: ఆన్లైన్ లో ఫోన్ బుక్ చేస్తే ఇవి డెలివరీ చేశారేంటి.?

ప్రస్తుత కాలంలో అందరూ కూడా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఇంట్లో ఉండే తమకు నచ్చిన వస్తువులను తెప్పించుకుంటున్నారు.ఆన్‌ లైన్‌ షాపింగ్‌ వచ్చిన తరువాత ప్రజలు కూడా ఆన్లైన్ లోనే వస్తువులను కొనడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు.

 Online Shopping, Amazon, E-commerce, Phone Ordered, At Last, Viral Latest,hydera-TeluguStop.com

చిన్న చిన్న వస్తువుల దగ్గర నుండి పెద్ద పెద్ద టీవీలు, వాషింగ్‌ మిషిన్లు, ఏసీలు వరకు అన్ని రకాల వస్తువులను ఆన్లైన్ లో కొనేస్తున్నారు.కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం ఆన్లైన్ లో మోసాలు జరుగుతూ ఉంటాయి.

అందుకే ప్రజలు కూడా నమ్మకమైన, గుర్తింపు పొందిన సంస్థలలో మాత్రమే వస్తువులు కొనుగోలు చేసుకుంటే మంచిది.అలాగే కొన్ని సార్లు ప్రముఖ ఈ – కామర్స్ సంస్థలు అయిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్లైన్ షాపింగ్ లలో కూడా మోసాలు జరగడం మనం చూసే ఉంటాము.

ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి రావడం లాంటివి మనం చాలానే చూసాము.తాజాగా ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.హైదరాబాద్ నగరంలోని బీకే గూడ పార్కుకు చెందిన విజయ్‌ కుమార్‌ అనే వ్యక్తి అమెజాన్‌ ద్వారా ఒప్పో మొబైల్‌ ఫోన్‌ ను ఆర్డర్ చేసాడు.క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ఆన్‌లైన్‌ రూ.11,990 చెల్లించి మరి ఫోన్‌ను కొనుగోలు చేశాడు.తీరా ఇంటికి వచ్చిన పార్సిల్‌ ఓపెన్ చేసి చూస్తే విజయ్ కుమార్ మతి పోయినంత పని అయింది.ఇంతకీ అందులో ఏముందో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వడం గ్యారంటీ.

అతను ఆర్డర్ చేసిన ఒప్పో ఫోన్‌ ఉండాల్సిన పెట్టెలో ఒక సబ్బు, సర్ఫ్‌ ప్యాకెట్‌ ఉన్నాయి.అవి చూసి ఒకింత ఆశ్చర్యానికి గురి అయ్యాడు.దీంతో వెంటనే అతను స్పందించి అమేజాన్‌కు మెయిల్‌ ద్వారా సమాచారం అందించాడు.అయితే మెయిల్ చేసినాగాని అమేజాన్‌ నుంచి సరైన ఫీడ్ బ్యాక్ రాకపోవడంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.

దీంతో బాధితుడు చెప్పిన వివరాలు విన్నా వినియోగదారుల ఫోరం ఏకంగా అమెజాన్‌ ఇండియా మేనేజర్, అప్పారియో రిటైల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ మేనేజర్‌ కు సమాచారం అందించి నోటీసులు పంపారు.

Telugu Amazon, Commerce, Phone Ordered, Latest-Latest News - Telugu

అయితే అమెజాన్‌ తరఫున హాజరైన న్యాయవాదుల తరుపున సరైన సాక్ష్యాలు లేకపోవడంతో విజయ్‌ కుమార్‌ ఫోన్‌ కోసం చెల్లించిన మొత్తంతో పాటు ఆ డబ్బుకి 9 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని ఆదేశించారు.అంతేకాకుండా ఫిర్యాదు దారుడికి కలిగిన ఇబ్బంది వలన అతను ఏంతో మానసిక వేదనకు గురి అయ్యాడు.కావున మరో రూ.10 వేలు నష్టపరిహారంగా చెల్లించాలని తెలిపింది.అలాగే కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ.5000 ఫిర్యాదుదారుడికి ఇవ్వాలని ఫోరం ఉత్తర్వులు జారీ చేసింది.ఎలాగయితేనే మనోడు డబ్బు గట్టిది.

పేరులోనే విజయాన్ని పెట్టుకున్న విజయ్ కుమార్ మధ్యలో డ్రాప్ అవ్వకుండా గట్టిగా పోరాటం చేసాడు.చివరికి విజయం దక్కించుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube