ఆన్ లైన్ లో పెళ్లి జరిపించిన పంతులు..!

కరోనా వల్ల ఆన్ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోం లు కామన్ అయ్యాయి.అయితే వెరైటీగా పెళ్లిల్లు కూడా ఆన్ లైన్ లో జరిగిపోతున్నాయి.

 Online Marriage Conduct At Medak District-TeluguStop.com

ఇలాంటి ఓ వెరైటీ పెళ్లి మెదక్ జిల్లా పాపన్నపేత మండలం సోంలా తండాలో జరిగింది.ముందుగా నిర్ణయించిన ముహుర్తానికి రెండు కుటుంబాల వారు పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశారు.

టెక్మాల్ మండలానికి చెందిన హరిచంద్ కుమారుడు మోహన్ కు.సోంలా తండాకు చెందిన బానోతు శివరాం కూతురు మంజులను ఇచ్చి పెళ్లి జరిపించాలని అనుకున్నారు.వివాహా కార్యక్రమానికి అంతా సిద్ధం చేశారు.అయితే కాసేపట్లో పురోహితుడు రావాల్సి ఉండగా ఆ దగ్గరలోనే ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడని తెలిసింది.

 Online Marriage Conduct At Medak District-ఆన్ లైన్ లో పెళ్లి జరిపించిన పంతులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా మృతదేహం ఉండతంతో పెళ్లి జరిపించడానికి పంతులు రానని చెప్పాడట. కొద్దిసేపు బ్రతిమిలాడినా చేసేదేమి లేక ఆ పంతులు చెప్పినట్టుగానే ఆన్ లైన్ లో మంత్రాలు చదువుతుంటే వధు, వరుల పెద్దలే పెళ్లి జరిపించారని తెలుస్తుంది.

వీడియో కాల్ ద్వారా పురోహితుడు మంత్రాలను చదివితే ఆయన చెప్పినట్టుగా పెళ్లి జరిపించారు పెళ్లి పెద్దలు.మొత్తానికి పురోహితుడు ఎదురుగా ఉండి వేదమంత్రాలతో జరగాల్సిన పెళ్లి కాస్త వీడియో కాల్ తో జరిగింది.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#COVID-19 #Distrit #Medak #Online Marriage #CoronaEffect

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు