50 శాతం ఆఫర్ అన్నారు.. చివరికి?

ప్రస్తుత కాలంలో నిరుద్యోగులను అవకాశం గా చేసుకుని కొంతమంది మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, అమాయకమైన ప్రజలను టార్గెట్ చేస్తూ, ఎన్నో మోసాలకు తెర తీస్తున్నారు.ఉద్యోగాల కోసం కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయి వాటిని ముందుగా బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందని ఇలాంటి మాయ మాటలు చెప్పి ఎంతో మందిని మోసం చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం.

 Online Fraudsters Cheating With Job Offers, Online Fraud, Hyderabad, Escape, 6 L-TeluguStop.com

ఇలాంటి తరహాలోనే హైదరాబాద్ కి చెందిన ఒక ఒక వ్యక్తికి బిజినెస్ లో 50 శాతం ఆఫర్ కల్పిస్తామని చెప్పి.చివరకు మోసం చేశారు దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

అయితే పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

హైదరాబాదులో హిమాయత్ నగర్ లో నివాసం ఉంటున్న అనిరుద్ అగర్వాల్ అనే వ్యక్తి వృత్తిరీత్యా వ్యాపారవేత్త కావడంతో, ఒక రోజు ఇండియా మార్ట్ ఈ కార్నవెబ్ సైట్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అని చెప్పి అజయ్ కులారియఅనే వ్యక్తి ఫోన్ చేశాడు.గుజరాత్ కి చెందిన శివ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ వివిధ రకాల నూనెలను దిగుమతి చేసుకుంటుంది.

వీరితో కలిసి వ్యాపారం చేస్తే ఎన్నో లాభాలుఉంటాయని ఎన్నో మాయమాటలు చెప్పి నమ్మించాడు.

అయితే పూర్తి వివరాలు కావాలంటే రాహుల్ అనే వ్యక్తిని సంప్రదించమని అతని ఫోన్ నెంబర్ ఇచ్చాడు.

అయితే తను వ్యాపారవేత్త కాబట్టి రాహుల్ అనే వ్యక్తి తో మాట్లాడుతూ వీరిరువురి మధ్య బిజినెస్ డీల్ కుదిరింది.అయితే సరుకు పంపించాలంటే, ముందుగా 50 శాతం డబ్బు ను తన ఖాతాలో జమ చేస్తే సరుకు పంపిస్తాం అని చెప్పడంతో, అనిరుద్ ఆరు లక్షల రూపాయలను రాహుల్ ఖాతాలో వేశారు.

డబ్బులు జమ చేసిన తర్వాత అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తను మోసపోయాడు అని అనుమానం రావడంతో, అనిరుద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు అనిరుద్ నుంచి రాహుల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

అయితే రోజు రోజుకి ఇలాంటి సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతోందని, ప్రజలందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube