ప్రస్తుత కాలంలో కొందరు సైబర్ నేరగాళ్లు ఆర్థిక నేరాలు చేయడం కోసం కొత్త పుంతలు తొక్కుతున్నారు.తాజాగా ఓ యువకుడికి అమ్మాయి పేరుతో ఫేస్ బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి అతడితో కొద్దిరోజులు అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి తీరా గుర్తు తెలియని ఓ లింక్ ని మెసేజ్ పంపించి ఆ యువకుడి నుంచి దాదాపుగా 96 వేల రూపాయలు స్వాహా చేసిన ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే ఇతర ప్రాంతానికి చెందిన ఓ యువకుడు స్థానిక హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నాడు.ఇతడు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా చాటింగ్ చేస్తూ గడుపుతుంటాడు.అయితే తాజాగా అనుకోకుండా ఓ రోజు ఓ అమ్మాయి పేరుతో ఉన్నటువంటి అకౌంట్ నుంచి యువకుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది.దీంతో యువకుడు ఆమెతో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు.
ఇందులో భాగంగా ఈ మధ్యకాలంలో ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని తరచూ ఫోన్లో కూడా మాట్లాడేవాడు.
అయితే ఎప్పటిలాగే యువకుడు ఆమెతో చాటింగ్ చేస్తుండగా గుర్తుతెలియని లింక్ అమ్మాయి అకౌంట్ ద్వారా తన మెసెంజర్ కి వచ్చింది.
దీంతో యువకుడు అనుకోకుండా ఆ లింక్ పై క్లిక్ చేశాడు.ఒక్కసారిగా తన బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి డబ్బు మొత్తం ఖాళీ అయినట్లు ఫోన్ కి మెసేజ్ వచ్చింది.
దీంతో ఒక్కసారిగా యువకుడు ఖంగు తిన్నాడు.అంతేకాక యువతి కి ఫోన్ చెయగా ఫోన్ నెంబర్ స్విచ్ఛాఫ్ వచ్చింది.
అలాగే మెసేజ్ చేయగా రిప్లై కూడా రాలేదు.దీంతో యువకుడు తాను మోసపోయానని గ్రహించి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తనకు న్యాయం చెయ్యాలంటూ కోరాడు.