దేశంలోనే తొలిసారి.. ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్!

మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? లేదా డ్రైవింగ్ లైసెన్స్ అప్ డేట్ చేయించుకోవాలా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.ఇకపై మీరు రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.

 Online Driving License, Driving License, Hyderabad, Minister Ktr Birthday, Telan-TeluguStop.com

అదేంటీ.మనం అప్ డేట్ చేయించుకోవాలి అంటే వెళ్ళాలి కదా అని అనుకుంటున్నారా? ఇకపై అవసరం లేదండీ.

ఎందుకంటే ఇక ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఆన్‌లైన్ ‌లోకి వచ్చేసింది.వివిధ రకాల పౌరసేవలు పొందే సదుపాయం దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణాలో అందుబాటులోకి వచ్చింది.లెర్నింగ్‌ లైసెన్సు, డ్రైవింగ్‌ లైసెన్సు, బ్యాడ్జ్, సాధారణ పత్రాల స్థానంలో స్మార్ట్‌కార్డులు వంటి ఐదు రకాల పౌరసేవలను ఆన్‌లైన్‌లోనే అందిస్తున్నారు.

Telugu License, Hyderabad, Ktr, Puvvada Ajay, Telangana, Ts Transport-General-Te

దీనికి సంబంధించిన పోర్టల్‌ను నిన్న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు.రాబోయే రోజుల్లో మరో 12 రకాల పౌరసేవలను ఆన్‌లైన్‌లో పొందే విధంగా సైట్ ని డెవలప్ చెయ్యనున్నారు అయన తెలిపారు.అంతేకాదు రవాణా శాఖ అందజేసే పౌరసేవలను మరింత సులభంగా చేసేందుకు ఆన్‌లైన్‌ సర్వీసులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు.
కాగా ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దనే వారికీ కావాల్సిన సేవలను పొందే సదుపాయం ఉన్నట్టు అయన పేర్కొన్నారు.కాగా ఇలా ఆన్లైన్ లో డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం దేశంలోనే తొలిసారి తెలంగాణాలో కావడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube