ఆధార్ తాకట్టుకు కిలో ఉల్లి.. ఏమిటో ఈ లొల్లి!  

Onions On Keeping Aadhar As Security By Samajwadi Party Leaders-national News,onions,samajwadi Party,security

ప్రస్తుతం దేశంలో ఉల్లి ధర అమాంతం ఆకాశానికి చేరుకున్నాయి.దీంతో సామాన్యులు ఉల్లిని కొనకముందే కంటతడి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉల్లి ధరల ప్రభావం తీవ్రంగా ఉంది.అక్కడ ఉల్లిని ప్రభుత్వాలు సబ్సిడి ద్వారా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Onions On Keeping Aadhar As Security By Samajwadi Party Leaders-national News,onions,samajwadi Party,security Telugu Viral News Onions On Keeping Aadhar As Security By Samajwadi Party Leaders-national-Onions On Keeping Aadhar As Security By Samajwadi Party Leaders-National News Onions Samajwadi

కాగా విక్రయదారులు ఉల్లిని అమ్మేందుకు పలు విచిత్రమైన పనులు చేస్తున్నారు.ఇటీవల ప్రభుత్వం అందించే ఉల్లి విక్రయకేంద్రంలో విక్రయదారులు హెల్మెట్‌లు పెట్టుకుని ఉల్లిని విక్రయించిన విషయం తెలిసిందే.కాగా తాజాగా సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు ప్రజల ఆధార్ కార్డును తాకట్టు పెట్టుకుని కిలో ఉల్లిని విక్రయిస్తున్నారు.ప్రభుత్వం ఉల్లి ధరలను నియంత్రించడంలో విఫలమైందంటూ ఇలా వినూత్నంగా నిరసనకు దిగారు.

కాగా కొన్ని చోట్ల వెండి వస్తువులు తాకట్టు పెట్టుకుని మరీ ఉల్లిని విక్రయించారు.అయితే కొన్ని దుకాణాల్లో ఉల్లిని లాకర్లలో పెట్టి అమ్ముతున్నారని, ప్రభుత్వం ఉల్లి ధరను వెంటనే నియంత్రించి సామాన్యుడిని ఆదుకోవాలని వారు కోరారు.ఏదేమైనా ప్రస్తుతం ఉల్లి ధర సామాన్యుల దగ్గర్నుండి ధనవంతుల వరకు కన్నీళ్లను తెప్పిస్తున్నాయి.అటు పొరుగు దేశాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.

సామాన్యులకు అందుబాటులోకి ఉల్లి ధరలు ఎప్పుడు వస్తాయా అని వారు ఆశగా చూస్తున్నారు.