బట్టలు కొనండి.. ఉల్లి ఉచితంగా పొందండి  

Onions On Purchase Of Clothes-mumbai,national News,onions,weird News

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లి ధర ఆకాశాన్ని అంటుకున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉల్లిని సబ్సిడీ కింద తక్కువ ధరకు ప్రజలకు అందిస్తోంది.ఇలాంటి సమయంలో ఉల్లి ఉచితం అంటే ఎవరైనా వద్దంటారా.

Onions On Purchase Of Clothes-mumbai,national News,onions,weird News Telugu Viral News Onions On Purchase Of Clothes-mumbai National News Onions Weird-Onions Free On Purchase Of Clothes-Mumbai National News Onions Weird

కానీ దానికి ఓ షరతు పెట్టి క్యాష్ చేసుకుంటున్నాడు ఓ వ్యాపారి.

ముంబైలోని ఉల్లాస్ నగర్‌కు చెందిన ఓ బట్టల వ్యాపారి తనవద్ద రూ.1000 బట్టలు కొనుగోలు చేస్తే కిలో ఉల్లి ఉచితంగా ఇస్తానంటున్నాడు.ఈ ఆఫర్ ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్లడంతో తన వ్యాపారం బాగా జరుగుతోందని సదరు వ్యాపారి తెలిపాడు.

ఉల్లి ఉచితం అని తెలియడంతో జనాలు తన షాపుకు ఎగబడుతున్నారని, అయితే అది షరతుతో కూడిన ఉచితం అని తెలుసుకుని వచ్చినవారిలో కొంతమంది బట్టలు కొంటున్నారని ఆనందిస్తున్నాడు.

ఏదేమైనా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో అతడు దాన్ని కూడా క్యాష్ చేసుకోవాలని వేసిన ప్లాన్‌ను పలువురు అభినందిస్తున్నారు.

కానీ ఇలాంటి వారు సామాన్యుల మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఆఫర్ ఉల్లాస్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది.ఇంకా ఉల్లి విచిత్రాలు ఎన్ని చూడాల్సి ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు