తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి లొల్లి

ఉల్లిగడ్డల సమస్య తెలుగు రాష్ట్రాలను పట్టిపీడిస్తుంది.ఉల్లి ధర ఆకాశన్నంటడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

 Onion Problems In Telugu States-TeluguStop.com

దీంతో ప్రభుత్వం అందించే రాయితీ ఉల్లిపాయల కోసం ప్రజలు ఎగబడుతున్నారు.కిలో ఉల్లి 150 రూపాయలు వరకూ పలుకుతున్న ఉల్లిని రైతు బజార్లలో 25 రూపాయలకే అందిస్తున్నారు.

దీంతో రైతుబజార్లలో ఉల్లిగడ్డల కోసం వినియోగదారులు బారులు తీరుతున్నారు.

తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చుంటున్నారు.

ఇవాళ ఆదివారం కావడంతో రైతు బజార్ల వద్ద రద్దీ చాలా ఎక్కువగా ఉంది.రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉండటంతో తమకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని వృద్ధులు, మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఒంగోలు, కడప, చిత్తూరుల్లోనూ పెద్దలు, పిల్లలు, మహిళలు, వృద్ధులు బారులు తీరుతున్నారు.గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.

దీంతో ఏపీలో గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటి ఉల్లిగడ్డలు సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణలోనూ ఉల్లి కష్టాలు తప్పడం లేదు.

హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని పలు రైతు బజార్ల వద్ద ఉల్లి కోసం వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు.ఉల్లి ధరలు దిగివచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube